సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 3 అక్టోబరు 2022 (19:35 IST)

ఐశ్వర్యారాయ్‌ని చూసి అసూయ కలిగింది.. మీనా

Aishwarya Rai
Aishwarya Rai
భర్తను కోల్పోయిన నటి మీనా ప్రస్తుతం సినిమాలపై దృష్టి పెట్టింది. తాజాగా మీనా పొన్నియన్ సెల్వన్ సినిమా గురించి, ఐశ్వర్యారాయ్ గురించి కామెంట్లు చేసింది. ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాలనటిగా కెరీర్‌ను మొదలుపెట్టిన మీనా తన సినీ కెరీర్‌లో ఎక్కువగా సాఫ్ట్ రోల్స్‌లో నటించారు.
 
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ అందుకున్న సీనియర్ హీరోలందరికీ మీనా జోడీగా నటించారు. కొన్ని నెలల క్రితం భర్తను కోల్పోయిన మీనా ఆ దుఃఖం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. తాజాగా తన ఫ్రెండ్‌తో కలిసి విదేశీ పర్యటన చేసిన మీనా తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్‌లో ఐశ్వర్యారాయ్ గురించి ఒక పోస్ట్ చేయగా ఆ పోస్ట్ ప్రస్తుతం  వైరల్ అయ్యింది. 
 
పొన్నియన్ సెల్వన్ సినిమాలో ఐశ్వర్యారాయ్ పోషించిన నందిని పాత్ర తన డ్రీమ్ రోల్ అని ఆ పాత్రను కొట్టేసిన ఐశ్వర్యారాయ్‌ను చూస్తుంటే తనకు అసూయ కలుగుతోందని మీనా చెప్పుకొచ్చారు. తన లైఫ్‌లో ఒకరిని చూసి అసూయ పడటం ఇదే తొలిసారి అని మీనా పోస్టు చేశారు. మీనా చేసిన పోస్ట్‌కు 40,000కు పైగా లైక్స్ వచ్చాయి.