శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 15 మార్చి 2024 (12:28 IST)

మెగా 156 విశ్వంబర లో భాగమైనందుకు సంతోషం ప్రకటించిన టీమ్

Mega Vishwambara
Mega Vishwambara
మెగా 156  విశ్వంబర షూటింగ్ హైదరాబాద్ శివార్లో జరుగుతోంది. ఇటీవలే ఓ పాట చిత్రీకరణ కూడా చేశారు. హైదరాబాద్ లోని కోకాపేటలోని ఓ సెట్లో ఈ పాటను చిత్రీకరించారు.  తదంతరం యాక్సన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అయితే ఇందులో భాగమైనందుకు చిత్ర టీమ్ సంతోషం వ్యక్తం చేస్తూ నేడు సోషల్ మీడియాలో గ్రూప్ ఫొటో పెట్టి ఆనందాన్ని వెలిబుచ్చింది. చోటాకె నాయుడు, ASPప్రకాష్, వంశీ, ప్రమోద్ తదితరులు ఇందులో కనిపించారు.
 
Vishwambara team at set
Vishwambara team at set
కొద్ది రోజుల విరామం తీసుకున్న చిరంజీవి నెక్స్ట్ షెడ్యూల్ లో  మరోసారి యాక్షన్ లోకి దిగబోతున్నారని తెలుస్తుంది. దీనికి తమిళ ఫైటర్లు ఇప్పటికే రిహార్సల్స్ చేస్తున్నారు. మరోవైపు రామ్ లక్మణ్ లు కూడా సెంటిమెంట్ ఫైట్ ను చేయడానికి సిద్ధమయ్యారని తెలిసింది. ఈ ఫాంటసీ వండర్ ని ప్రతిష్టాత్మకంగా యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా త్రిష హీరోయిన్ గా నటిస్తుంది వచ్చే ఏడాది జనవరి 10 న సంక్రాంతి కానుకగా విడుదలకు మెగాస్టార్ సిద్ధమవుతున్నారు.