సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 15 మార్చి 2024 (11:37 IST)

రామ్ చరణ్, బుచ్చిబాబు సినిమా అప్ డేట్

Ramcharan
Ramcharan
రామ్ చరణ్ తాజా సినిమా తమిళ దర్శకుడు శంకర్ నేత్రుత్వంలో గేమ్ ఛేంజర్ షూటింగ్ జరుగుతోంది. ఈనెల  27 న రామ్ చరణ్ పుట్టినరోజు. గతం ఏడాది గేమ్ ఛేంజర్ షూట్ లోనే పుట్టినరోజు జరుపుకున్నారు. కానీ ఈసారి చరణ్ కు బుచ్చిబాబు సినిమా సెట్లో చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. చరన్, బుచ్చిబాబు సినిమా మార్చి 20 న ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.
 
కాగా, ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఉత్తరాంధ్రలో నటీనటుల కోసం ఆడిషన్ నిర్వహించారు. ఇందులో కొత్త టాలెంట్ తోపాటు య్యూటూబర్ లను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. వీరితో రియలస్టిక్ గా వుంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను నవీన్ యెర్నేని-వై రవిశంకర్, ప్రుధ్వీ కుమార్ నిర్మాతలు.