గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 13 ఫిబ్రవరి 2024 (16:22 IST)

రామ్ చరణ్ స్టయిల్ లుక్ తో అదుర్స్

charana new style
charana new style
రామ్ చరణ్ ఏదో ఒక యాడ్ చేసేటప్పుడు తన లుక్ ను విడుదల చేస్తుంటాడు. ఒకవైపు సినిమా గేమ్ ఛేంజర్ కోసం ఒక లుక్ తో వుండగా, షూటింగ్ గేప్ లో సరికొత్త వాణిజ్యప్రకటన చేస్తున్నాడు. దీనికి సంబంధించిన లుక్ ను ఈరోజు సోషల్ మీడియాలో విడుదల చేశాడు. ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ అలీమ్ హకీమ్ తో చేసిన తన నయా హెయిర్ స్టైల్ లుక్ లో చరణ్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు.
 
ఇక చరణ్ లుక్ చూడగానే ఆయన అభిమానులు దాన్ని పెద్ద వైరల్ గా మార్చేశారు. గ్లోబల్ స్టార్ అదుర్స్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా వుండగా, దర్శకుడు శంకర్ తో చేస్తున్న “గేమ్ చేంజర్” షూట్ లో కొంతమేర పూర్తి కావాల్సి వుంది. మరోవైపు దర్శకుడు బుచ్చిబాబు తో సినిమా అయితే అతి త్వరలోనే స్టార్ట్ కానుంది.