శుక్రవారం, 4 ఏప్రియల్ 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 1 ఏప్రియల్ 2025 (13:04 IST)

ఈ సంక్రాంతికి రఫ్ఫాడించేద్దామంటున్న మెగాస్టార్! (Video)

mega157
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కే చిత్రం ఇటీవలే ప్రారంభమైంది. ఈ సినిమా వర్కింగ్ టైటిల్‌‌గా మెగా 157 అనే ఖరారు చేశారు. జూన్ లేదా జూలై నెలలో సెట్స్‌పైకి తీసుకెళ్ళనున్నారు. ఈ క్రమంలో సినిమాకు సంబంధించి మేకర్స్ ఓ ప్రత్యేక వీడియోను తాజాగా రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి పని చేస్తున్న టెక్నీషియన్లలో కీలకమైనవారితో చిరంజీవి ఇంటరాక్ట్ అవుతున్న వీడియోను రిలీజ్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం యూట్యూబ్‌లో వైరల్‌గా మారింది.
 
చిరంజీవి నటించిన సినిమాల్లోని పాత్రలను చెబుతూ ఒక్కొక్కరు వారు చేయనున్న వర్క్‌ను వివరించడం ఈ వీడియోలో కనిపిస్తుంది. ఈ వీడియో ఆఖరులో "ఈ సంక్రాంతికి రఫ్ఫాడించేద్దాం" అంటూ చిరంజీవి చెప్పిన నేపథ్యంలో 2026 సంక్రాంతికి విడుదల చేసినా ఈ సినిమా షూటింగును శరవేగంగా పూర్తి చేసేందుకు చిత్ర బృందం పనిచేస్తున్నట్టు సమాచారం.