గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శనివారం, 15 మే 2021 (19:34 IST)

ద‌ర్శ‌కుడిపై క్లారిటీ ఇచ్చిన మెగా కాంపౌండ్‌

mohan-chiru
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం క‌రోనా వ‌ల్ల ఆగిపోయింది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ కాగా, మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. రామ్ చరణ్ కూడా ఆచార్యలో కీల‌క పాత్ర‌లో నటిస్తున్నారు. ప్ర‌స్తుతం చిరంజీవి ప్ర‌జ‌ల‌ను చైత‌న్య‌వంతుల్ని చేసే ప‌నిలో వున్నారు. క‌రోనా బారిన ప‌డ‌కుండా ఇంటివ‌ద్ద‌నే వుండండి. మాస్క్‌లు ధ‌రించండి. ప్లాస్మా అవ‌స‌ర‌మైన‌వారికి దానం చేసి ప్రాణాన్ని కాపాడండి అంటూ వివ‌రిస్తున్నారు.
 
ఇదిలా వుండ‌గా, చిరంజీవి ఆచార్య తరువాత నటించనున్న మలయాళ రీమేక్ సినిమా లూసిఫర్. ఈ సినిమాకు మరోసారి డైరెక్టర్ మారారు అంటూ ఈ మధ్య టాలీవుడ్లో ఒక న్యూస్ వైరల్ అయింది. వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నాడ‌ని వార్త వ‌చ్చింది. కాగా ఆ వార్త‌లో ఏమాత్రం నిజం కాదని మెగా కాంపౌండ్ తేల్చి చెప్పింది. ఈ చిత్రానికి దర్శకుడు మోహన్ రాజానే అని క్లారిటీ ఇచ్చారు. అతి త్వరలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది అని మెగా వర్గాలు తెలియజేశారు.