ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By జె
Last Updated : మంగళవారం, 23 ఏప్రియల్ 2019 (20:37 IST)

మా అమ్మకు నేనే రెండో పెళ్ళి చేశా.. తప్పేంటి..? మెగా హీరో ప్రశ్న

సాయి ధరమ్ తేజ్ గురించి అస్సలు పరిచయం అక్కర్లేదు. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన మరో హీరో. వరుసగా పరాజయాలు వస్తున్నా.. పట్టించుకోకుండా సినిమాలను తీస్తూనే ఉన్నాడు. ఐతే తాజాగా చిత్రలహరి సినిమాతో సాయిధరమ్ తేజ్ సక్సెస్‌ను అందుకున్నారు. కానీ ఈమధ్య కాలంలో సాయి ధరమ్ తేజ్ చెప్పిన మాటలు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి.
 
నాకు సరిగ్గా 10 సంవత్సరాలు. మా అమ్మానాన్నకు ఒకటే గొడవలు. ఇంట్లో ఎప్పుడూ గొడవలే. చిన్నచిన్న మనస్పర్థలే గొడవలకు కారణమయ్యేవి. మా అమ్మానాన్నలు విడిపోతారనుకున్నా.. అనుకున్న విధంగానే విడాకులు తీసుకుని విడిపోయారు. ఐదేళ్ళ పాటు మా అమ్మ ఒంటరిగానే ఉంది. బాగా కష్టపడింది. మమ్మల్ని కష్టపడి చదివించింది. కానీ తండ్రి లేని లోటు నాకు బాగా అర్థమైంది. 
 
అందుకే నా తల్లిని బ్రతిమాలి ఒప్పించా.. రెండో పెళ్ళి నేనే చేశా. ఆయన కంటి డాక్టర్. చాలా మంచివారు. మా అమ్మను బాగా చూసుకుంటున్నారు. నేను.. మా తమ్ముడు.. ఆయనతో కలిసే ఉన్నాం అంటున్నాడు సాయిధరమ్ తేజ్.