శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 16 సెప్టెంబరు 2024 (17:20 IST)

కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన మేఘా ఆకాశ్

megha akash
టాలీవుడ్ యువ నటి మేఘా ఆకాశ్ తన జీవితంలో కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టింది. బ్యాచిలర్ లైఫ్‌కు బై బై చెబుతూ వైవాహిక బంధంలోకి అడుగు పెట్టింది. సాయి విష్ణుతో కలిసి ఏడడుగులు నడిచింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా పంచుకుంది.
 
తన పెళ్లి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన మేఘా ఆకాశ్‌.. ‘ఇది నా జీవితంలో ఫేవరేట్ చాప్టర్’ అని తన ఆనందానికి అక్షర రూపమిచ్చింది. ఈ ఫొటోల్లో నూతన వధూవరులు ఎంతో అందంగా కనిపించారు. 
 
చెన్నైలో జరిగిన మేఘా ఆకాశ్ పెళ్లి వేడుకలో పలువురు సినీ తారలతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా పాల్గొన్నారు. కొత్త దంపతులను  ఆశీర్వదించారు. ప్రస్తుతం మేఘా ఆకాశ్‌ పెళ్లి ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు మేఘా ఆకాశ్, విష్ణు దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.