బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 27 ఆగస్టు 2024 (09:24 IST)

ఇప్పటికీ పెళ్లి ప్రణాళికలు... కాశ్మీర్ విద్యార్థినులతో రాహుల్ చిట్ చాట్!!

Rahul Gandhi
ఇప్పట్లో అయితే తనకు పెళ్లి ప్రణాళికలేవీ లేవని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. తాజాగా కాశ్మీర్ విద్యార్థినినులతో ఆయన చిట్ చాట్ నిర్వహించారు. ఆ సమయంలో ఓ విద్యార్థిని రాహుల్ గాంధీ వద్ద పెళ్లి ప్రస్తావన తెలిపారు. పెళ్లి ఇపుడు ప్రణాళికలు లేవని, కానీ తోసిపుచ్చలేమని వ్యాఖ్యానించారు. అయితే, తాను పెళ్లి చేసుకుంటే అందర్నీ ఆహ్వానిస్తామని తెలిపారు. 
 
ఇటీవల రాహుల్ గాంధీ జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో పర్యటించారు. ఆ సమయంలో శ్రీనగర్‌కు చెందిన విద్యార్థినులతో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా ఓ యువతి పెళ్లి ప్రస్తావన తెచ్చింది. దానికి రాహుల్ గాంధీ నవ్వుతూ సమాధానం చెప్పారు. 20 - 30 యేళ్ల నుంచి ఓ ఒత్తిడిని అధిగమిస్తూ వస్తున్నారన్నారు. ఇపుడు పెళ్లి ప్రణాళికలు లేనప్పటికీ కొట్టిపారేయలేమన్నారు. ఈ సమయంలో విద్యార్థులు జోక్యం చేసుకుని పెళ్లి చేసుకుంటే తమను ఆహ్వానించాలని కోరారు. దానికి రాహుల్ స్పందిస్తూ తప్పకుండా అందర్నీ ఆహ్వానిస్తానని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. ఇందుకు సుంబంధించిన వీడియోను కూడా ఆయన తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు.