శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 26 ఆగస్టు 2024 (10:14 IST)

బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత పెళ్లి చేసుకున్న అమీ జాక్సన్ - వెస్ట్‌‍విక్

Amy Jackson And Ed Westwick
నటి నటి అమీ జాక్సన్‌, హాలీవుడ్‌ నటుడు ఎడ్‌ వెస్ట్‌విక్‌ వివాహ బంధంతో ఒక్క‌ట‌య్యారు. సోషల్‌ మీడియా వేదికగా ఇరువురు తమ పెళ్లి ఫొటోల‌ను అభిమానుల‌తో పంచుకున్నారు. కొత్త ప్రయాణం ఇప్పుడే మొదలైందంటూ ఫ్యాన్స్‌కు పెళ్లి కబురు చెప్పారు. కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట‌ తాజాగా ఇటలీలో పెళ్లి చేసుకుంది. అయితే అమీ జాక్సన్‌ గతంలో కొంతకాలం పాటు జార్జ్‌ పనియోటౌ అనే వ్యాపారవేత్తతో సహజీవనం చేసిన విషయం తెల్సిందే. 
 
ఈ జంటకు ఆండ్రూ అనే బాబు పుట్టాడు. 2020లో అమీ, జార్జ్‌ వివాహం చేసుకోవాలని అనుకున్నారు. కానీ కరోనా కారణంగా వాయిదా పడింది. ఆ తర్వాత వారి మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయారు. ఈ క్ర‌మంలో సౌదీలో జరిగిన ఓ ఫిల్మ్ ఫెస్టివల్‌లో నటుడు ఎడ్ వెస్ట్‌విక్‌ను అమీ జాక్సన్ తొలిసారి కలిశారు. ఆ సమయంలో వీరి మధ్య పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. ఇప్పుడు ఈ జంట పెళ్లి బంధంలోకి అడుగుపెట్టింది.
 
కాగా, అమీ జాక్సన్ తెలుగులో "ఎవడు", "ఐ", "2.0" వంటి చిత్రాల్లో నటించారు. ఆమె నటించిన "మిషన్ చాప్టర్ 1", "క్రాక్" (హిందీ) చిత్రాలు ఇటీవల విడుదలయ్యాయి. కాగా, అమీ ఇటు టాలీవుడ్‌తోనూ పాటు బాలీవుడ్, కోలీవుడ్ చిత్రాల్లో కూడా నటించారు.