ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 20 నవంబరు 2017 (11:54 IST)

'జవాన్' ప్రీ రిలీజ్ వేడుక.. మెహ్రీన్ సందడే సందడి... (ఫోటోలు)

మెగా ఫ్యామిలీ హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం "జవాన్". మెహ్రీన్ హీరోయిన్. బివిఎస్ రవి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రాన్ని నిర్మాత దిల్ రాజు సమర్పణలో అరుణాచల్ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత కృష్ణ

మెగా ఫ్యామిలీ హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం "జవాన్". మెహ్రీన్ హీరోయిన్. బివిఎస్ రవి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రాన్ని నిర్మాత దిల్ రాజు సమర్పణలో అరుణాచల్ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత కృష్ణ తెరకెక్కించారు.
 
వచ్చే నెల ఒకటో తేదీన విడుద‌ల కానుంది. దీంతో ఆదివారం రాత్రి ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. ఈ కార్య‌క్ర‌మానికి సంబంధించిన కొన్ని పోస్టర్లను మేక‌ర్స్ విడుద‌ల చేయ‌గా, ఇవి సోషల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. థమ‌న్ స్వ‌ర‌ప‌ర‌చిన బాణీలు ఇప్ప‌టికే విడుద‌ల కాగా, ఇవి సంగీత ప్రియులని ఎంత‌గానో అల‌రిస్తున్నాయి.
 
దేశానికి 'జవాన్' ఎంత అవసరమో... ప్రతీ ఇంటికి 'జవాన్‌'లోని క‌థానాయకుడులాంటి వాడు ఉండాలని ద‌ర్శ‌కుడు చెబుతున్నాడు. ఈ మూవీ తేజూకి మంచి పేరు తీసుకొస్తుంద‌ని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇక ఈ మూవీ హీరోయిన్ మెహ్రీన్.. జవాన్ ప్రీ రిలీజ్ వేడుకకు హాజరై సందడి చేసింది. దానికి సంబంధించిన ఫోటోలు ఇవే...