మార్చి 13న "ఎఫ్2" బ్యూటీ నిశ్చితార్థం.. వరుడు ఎవరంటే..?
ఉత్తరాది నుంచి దిగుమతి అయిన హీరోయిన్లలో మెహ్రీన్ ఒకరు. ఈమె ఖాతాలో పలు హిట్ చిత్రాలు ఉన్నాయి. ముఖ్యంగా, "ఎఫ్-2" చిత్రం ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. అలాంటి ఈ ముద్దుగుమ్మ త్వరలోనే ఓ ఇంటికి కోడలుకానుంది.
పంజాబ్‌కు చెందిన మెహ్రీన్... హర్యానా మాజీ ముఖ్యమంత్రి భజన్‌లాల్ భిష్ణోయ్ మనుమడు భవ్య బిష్ణోయ్‌ను పెళ్లాడనుంది. వీరిద్దరి నిశ్చితార్థం మార్చి 13న వీరి నిశ్చితార్థం రాజస్థాన్‌లోని జోద్‌పూర్ విల్ల ప్యాలెస్‌లో జరగనుంది. ఆ తర్వాత వీరి వివాహం జరుగుతుంది. ఇది పెద్దలు కుదిర్చిన సంబంధమని, జీవితంలో కొత్త ప్రయాణానికి సిద్ధమవుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని మెహ్రీన్ చెప్పుకొచ్చింది.
ఇదిలావుంటే, తనకు కాబోయే భర్త భవ్య పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. దీంతో ఆయనకు బర్త్‌డే శుభాకాంక్షలు తెలియజేస్తూ.. అతనితో దిగిన ఫొటో షేర్ చేసింది. ఈ పిక్ సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తుంది.
కృష్ణగాడి వీరప్రేమగాథ చిత్రం ద్వారా కథానాయికగా పరిచయమైన ఈ అమ్మడు "మహానుభావుడు", "రాజా ది గ్రేట్", "నోటా", "ఎఫ్-2" చిత్రాల ద్వారా యువతరంలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. తెలుగు, తమిళ భాషల్లో దాదాపు 17 చిత్రాల్లో నాయికగా నటించింది. ప్రస్తుతం మెహ్రీన్ రీన్ తెలుగులో "ఎఫ్-2" సీక్వెల్ "ఎఫ్-3"లో కథానాయికగా నటిస్తోంది.