మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By శ్రీ
Last Modified: శనివారం, 12 సెప్టెంబరు 2020 (19:12 IST)

సినీ స్టార్సే కాదు పొలిటీషియన్స్‌కి కూడా డ్రగ్స్ మాఫియాతో లింకులు: కుమారస్వామి

దేశంలోని కొందరు సినీ స్టార్స్ కే కాదు 'డ్రగ్స్ మాఫియాతో కొందరు రాజకీయ నాయకులకు సంబంధాలు ఉన్నాయి' అంటూ కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. సిట్టింగ్ సీఎంతో భేటీ తరువాత మాజీ సీఎం ఇలాంటి వ్యాఖ్యలు చెయ్యడం రాజకీయంగా కలకలం రేపింది.
 
సినీ తారలతో పాటు రాజకీయ నాయకులు ఎవరెవరికి డ్రగ్స్ మాఫియాతో లింక్ ఉంది? అనే విషయంపై నిష్పక్షపాతంగా విచారణ జరగాలని మాజీ సీఎం హెచ్.డి. కుమారస్వామి అన్నారు.
 
మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే జమీర్ అహమ్మద్‌కు డ్రగ్ కేసులో అరెస్టు అయిన నటి సంజనాతో లింక్ ఉందని ఆరోపణలు వస్తున్న సమయంలో మాజీ సీఎం కుమారస్వామి వ్యాఖ్యలు కలకలం రేపాయి.