సోమవారం, 27 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 3 జులై 2018 (14:09 IST)

వ్యభిచారం కోసం వెళ్లలేదు.. వీకెండ్ హాలిడేకు వెళ్లానంటున్న హీరోయిన్

అమెరికాలోని చికాగో రాష్ట్రంలో వెలుగుచూసిన తెలుగు హీరోయిన్ వ్యభిచారదందా ప్రకంపనలు ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. ఈ స్కామ్‌లో పలువురు హీరోయిన్ల పాత్ర ఉన్నట్టు వార్తలు వచ్చిన విషయం తెల్సిందే. ఈ పే

అమెరికాలోని చికాగో రాష్ట్రంలో వెలుగుచూసిన తెలుగు హీరోయిన్ వ్యభిచారదందా ప్రకంపనలు ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. ఈ స్కామ్‌లో పలువురు హీరోయిన్ల పాత్ర ఉన్నట్టు వార్తలు వచ్చిన విషయం తెల్సిందే. ఈ పేర్లలో టాలీవుడ్ హీరోయిన్ మెహరీన్ కూడా ఉన్నట్టు వార్తలు గుప్పుమన్నాయి.
 
ఈ నేపథ్యంలో ఇటీవల వాంకోవర్ నుంచి లాస్ వెగాస్ వెళుతున్న మెహరీన్‌ను అమెరికా సరిహద్దు భద్రతాధికారులు విచారించారు. ఈ విషయాన్ని మెహరీనే స్వయంగా వెల్లడించింది. అయితే, సోషల్ మీడియా వేదికగా ఆమెపై అనేక ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఈ దందాపై మరోమారు ట్విట్టర్ వేదికగా వివరణ ఇచ్చారు. 
 
'పంతం' ప్రమోషనల్ ఈవెంట్‌లో హీరోయిన్ల వ్యభిచారంపై మెహరీన్ సంచలన వ్యాఖ్యలు చేసిందంటూ ఓ పత్రిక ప్రత్యేక కథనాన్ని ప్రచురించగా, మెహరీన్ దాన్ని ఖండించింది. 'ఈ కథనం పూర్తి అవాస్తవం. నేను ఆ ఇంటర్వ్యూను ఇవ్వలేదు. మీడియాతో నాకు సత్సంబంధాలు ఉన్నాయి. అసలు 'పంతం' ప్రమోషన్ కార్యక్రమంలో నేను పాల్గొనలేదు. ఆ సమయంలో వైరల్ ఫీవర్‌తో ముంబైలో ఉన్నాను' అని చెప్పుకొచ్చింది. 
 
'యూఎస్ఏలో ఏం జరిగిందో మరోసారి నిజం చెబుతున్నాను. నేను నా కుటుంబంతో కలసి వీకెండ్ హాలిడే కోసం వాంకోవర్ నుంచి లాస్ వెగాస్ వెళుతున్నాను. ఇమిగ్రేషన్ చెకింగ్ సమయంలో నేను తెలుగు సినిమాల్లో నటినని వారికి తెలిసింది. అప్పుడు వారు నన్ను అమెరికాలో ప్రయాణానికి కారణాలేంటని అడిగారు. వ్యభిచార దందా గురించి చెప్పారు. ఆ విషయాన్ని తొలిసారిగా విన్నది అప్పుడే. 
 
పైగా, వ్యభిచారంతో నాకు సంబంధం లేదని తెలుసుకుని క్షమాపణలు చెప్పి పంపించారు. ఆపై నాకు ఎలాంటి సమస్యా ఎదురుకాలేదు. ఈ విషయాన్ని నేనే బహిరంగ పరిచాను. మరెవరైనా ఈ విషయంపై అవాస్తవాలు ప్రచారం చేస్తారన్న ఉద్దేశంతోనే ఈ పని చేశాను. ఆ సమయంలో నా పరిస్థితికి నేను సిగ్గుపడ్డాను. వణికిపోయాను కూడా' అని వ్యాఖ్యానించింది.