సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 20 జులై 2023 (20:14 IST)

భోళాశంకర్ నుంచి అప్డేట్.. మిల్కీ బ్యూటీ.. నువ్వే నా స్వీటీ.. ప్రోమో

Milky Beauty Song Promo
Milky Beauty Song Promo
మెగాస్టార్ చిరంజీవి, మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళాశంకర్ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. తమన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా ఆగస్టు 11న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలుగా కీర్తి సురేష్ కనిపించనుంది. తమిళంలో ఘనవిజయం సాధించిన వేదాళం సినిమాకు రీమేక్‌గా భోళాశంకర్ తెరకెక్కింది. 
 
ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు పాటలను రిలీజ్ చేశారు. తాజాగా మూడో పాట ప్రోమోను రిలీజ్ చేశారు. మిల్కీ బ్యూటీ.. నువ్వే నా స్వీటీ అంటూ సాగే ఈ పాటలో చిరంజీవి, తమన్నా స్టెప్పులు అదిరిపోయాయి. 
 
ఈ పాటను మంచుకొండల్లో, అందమైన లోకేషన్లలో చిత్రీకరించినట్లు ప్రోమోను చూస్తే తెలిసిపోతుంది. ఈ పూర్తి పాటను రేపు (శుక్రవారం) సాయంత్రం 4:05 గంటలకు రివీల్ చేస్తున్నట్లుగా చిత్ర బృందం ప్రకటించింది.