శనివారం, 22 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Raju
Last Updated :హైదరాబాద్ , శనివారం, 29 ఏప్రియల్ 2017 (04:28 IST)

అందంతో బతికేసిన అందగత్తె బ్రాహ్మణ యువతిగా మెరవనుందా?

దాదాపు పదేళ్లు చిత్రసీమలో కేవలం అందాలను ఆరబోసి తెలుపురంగుతో బతికేస్తున్న నటి ఎవరన్నా ఉందా అంటే ముక్తకంఠంతో అందరూ చెప్పే సమాధానం తమన్నా భాటియా అనే. బాహుబలికి ముందు ఆమె ఒక బ్యూటీ డాల్. బ్రహ్మకు రిమ్మతెగ

దాదాపు పదేళ్లు చిత్రసీమలో కేవలం అందాలను ఆరబోసి తెలుపురంగుతో బతికేస్తున్న నటి ఎవరన్నా ఉందా అంటే ముక్తకంఠంతో అందరూ చెప్పే సమాధానం తమన్నా భాటియా అనే. బాహుబలికి ముందు ఆమె ఒక బ్యూటీ డాల్. బ్రహ్మకు రిమ్మతెగులు పుడితే ఆ తమకంలో తట్టుకోలేక తమన్నాను సృష్టించి ప్రాణం పోసి ఆనక భూమ్మీదికి వదిలేశాడని చెబుతుంటారు. నటన కాకుండా కేవలం గ్లామర్‌తో దశాబ్దం పైగా బతికేస్తున్న తమన్నా బాహుబలి ది బిగినింగ్‌తో ఒక్కసారిగా ఎక్కడికో వెళ్లిపోయింది. దేవసేనను తప్పించే దళంలో వీరనారిగా, ప్రభాస్ మెచ్చిన ప్రియురాలిగా తమన్నా బాహుబలి1 లో ప్రభంజనం సృష్టించింది. 
 
బాహుబలి తమన్నాకు రీఎంట్రీ ఇచ్చిందనే చెప్పాలి. అంతకు ముందు వరకూ గ్లామర్‌ పాత్రలకే పరిమితమైన తమన్నా దశ, దిశను బాహుబలి చిత్రం మార్చేసిందనే చెప్పొచ్చు. ఆ తరువాత వరుసగా నటనకు అవకాశం ఉన్న పాత్రలే ఆ ముద్దుగుమ్మను వరిస్తున్నాయని చెప్పవచ్చు. ప్రస్తుతం మంచి జోష్‌లో ఉన్న తమన్నా తాజాగా మడికట్టు అమ్మీ అవతారమెత్తింది. 
 
ఒక పక్క సంచలన నటుడు శింబుతో అన్భానవన్‌ అసరాధవన్‌ అడంగాధవన్‌ చిత్రంలో రొమాన్స్‌ చేస్తున్న ఈ బ్యూటీ మరో పక్క సియాన్‌ విక్రమ్‌తో స్కెచ్‌ చిత్రంలో డ్యూయెట్లు పాడుతోంది. విక్రమ్‌కు జంటగా నటిస్తున్న మిల్కీబ్యూటీ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన యువతి పాత్రలో దర్శనమిస్తుందట. ఇందులో పాఠాలు చెప్పే టీచరమ్మగా నటిస్తున్న తమన్నా కొన్ని సన్నివేశాల్లో మడికట్టు అమ్మీగా మెరవనుందట.స్కెచ్‌ చిత్రంలో ఈ అమ్మడి పాత్ర చాలా కీలకంగా ఉంటుందట