బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 6 ఏప్రియల్ 2024 (16:14 IST)

బిగ్ బాస్ ఫేమ్ అశ్విని శ్రీ ప్రధాన పాత్రలో మిస్ జానకి చిత్రం

Ashwini Sri
Ashwini Sri
బిగ్ బాస్ ఫేమ్ అశ్విని శ్రీ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం మిస్ జానకి. సతీష్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఈరోజు అత్యంత ఘనంగా పూజా కార్యక్రమం నిర్వహించుకుంది. సీ కళ్యాణ్ క్లాప్ కొట్టి సినిమాను ప్రారంభించారు. ఎన్ ఎన్ చాందిని క్రియేషన్స్ బ్యానర్ పై నాగరాజు నెక్కంటి నిర్మాణ సారథ్యంలో రూపొందుతోంది. 
 
మంచి కథను అందించాలనే రెండు సంవత్సరాల క్రితం రాసుకున్న కథ అని, ఇన్నాళ్లకు ఓ మంచిటీమ్ తో కుదిరింది అని నటుడు మహేష్ కుమార్ తెలిపారు. ఏప్రిల్ 20 నుంచి ఏకధాటిగా 30 రోజులు రెగ్యూలర్ షూటింగ్ జరుపుకుంటుందని, ఆ తరువాత మరో షెడ్యూల్ తో షూటింగ్ పూర్తి చేస్తామని అన్నారు. ఇది లేడీ ఓరియెంటెడ్ చిత్రం అని నటీ అశ్విని శ్రీ కు మంచి పేరుతీసుకొస్తుందని పేర్కొన్నారు.
 
Miss Janaki Opening
Miss Janaki Opening
అశ్విని శ్రీ మాట్లాడుతూ.. బిగ్ బాస్ తరువాత చాలా స్టోరీలు విన్నాను కానీ మిస్ జానకి స్టోరీ విన్నప్పుడు చాలా బాగుంది. చాలా డిఫరెంట్ గా ఉందని వెంటనే ఈ సినిమానే చేయాలని ఫిక్స్ ఐనట్లు తెలిపారు. ఈ  సినిమాలో తన క్యారెక్టర్ చాలా బాగుందని డీజే టిల్లు సినిమాలో రాధిక క్యారెక్టర్ ల అందరికి గుర్తుండిపోతుంది అని తెలిపారు. ఇక ప్రొడ్యూసర్ నాగరాజు నెక్కంటి కు థ్యాంక్స్ చెప్పారు. డైరెక్టర్ సతీష్ కుమార్ ఈ సినిమాతో మంచి విజయం అందుకుంటాడు అని వెల్లడించారు.
 
డైరెక్టర్ సతీష్ కుమార్ మాాట్లాడుతూ.. అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ నాగరాజు నెక్కంటి కు థ్యాంక్స్ చెప్పారు. అలాగే కథ నమ్మి తనతో జర్నీ చేస్తున్న నటీనటులకు, టెక్నిషన్స్ ధన్యవాదాలు తెలిపారు. ఈ సినిమా కచ్చితంగా అందరికిి నచ్చుతుందని త్వరలోనే షూటింగ్ ప్రారంభించి మంచి అవుట్ ఫుట్ ఇస్తామని నమ్మకంతో టీమ్ అంతా ఉన్నట్లు పేర్కొన్నారు.
 
శాని సాల్వమని మాట్లాడుతూ.. కథ చాలా బాగుందని, ముఖ్యంగా హీరోయిన్ కు చాలా మంచి పేరు వస్తుందని అన్నారు. అలాగే ఈ సినిమాలో తనకు ఓ మంచి క్యారెక్టర్ ను రాశారని, అది తెరపై ఎలా వస్తుందో చూడాలనే అతృత ఉన్నట్లు పేర్కొన్నారు. డైరెక్టర్ సతీష్ కుమార్, మహేష్ కుమార్ ఎంతో హార్డ్ వర్క్ చేస్తున్నారని పేర్కొన్నారు.
 
డైరెక్టర్ సతీష్ కుమార్, మహేష్ కుమార్ ఇద్దరు సినిమా కోసం ఎలా కష్టపడుతున్నారో దగ్గరుండి చూస్తున్నట్ల యాక్టర్ లోబో పేర్కొన్నారు. ఇది చిన్న సినిమా కాదు అని తెలిపారు.  కథ బాగుండాలి అదొక్కటే టార్గెట్ పెట్టుకోవాలి అంతేకానీ చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా ఏమి లేదని వెల్లడించారు. సినిమాలో ఒక్క ఛాన్స్ వస్తే చాలు అనుకున్న జూనియర్ ఆర్టిస్ట్ స్థాయి నుంచి ఇప్పుడు లోబో అంటే అందరూ గుర్తిస్తున్నారంటే దానికి కారణం బిగ్ బాస్ అని అన్నారు. ఈ సినిమాలో లెజండరీ పర్సన్ తనికెళ్ళ భరణి తో  కాంబినేషన్ సీన్స్ ఉన్నట్లు పేర్కొన్నారు. సినిమాకు మంచి పేరు వస్తుందని ప్రొడ్యూసర్ కు ధన్యవాదాలు తెలిపారు.