మోహన్ బాబు ఇండిపెండెన్స్ డే కానుక.. సన్ ఆఫ్ ఇండియా ఫస్ట్ లుక్

Mohan babu
సెల్వి| Last Updated: శనివారం, 15 ఆగస్టు 2020 (17:18 IST)
Mohan babu
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తన కొత్త సినిమాను ప్రకటించారు మోహన్ బాబు. ఈ మూవీ ఫస్ట్‌లుక్ కూడా రిలీజ్ చేస్తూ సినిమాపై ఆసక్తి రేకెత్తించారు. గాయత్రి మూవీ తర్వాత మోహన్ బాబు మరోసారి హీరోగా నటించలేదు. ఆ తర్వాత 'మహానటి' లో ఎస్వీఆర్ పాత్రలో నటించారు. ఇపుడు సూర్య హీరోగా నటిస్తోన్న 'ఆకాశమే నీ హద్దురా' సినిమాలో నటిస్తున్నారు.

ఇక తాజా చిత్రంలో మోహన్ బాబు ఎయర్‌ఫోర్స్ అధికారి పాత్రలో నటిస్తున్నారు. మోహన్ బాబు 74వ స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా 'సన్ ఆఫ్ ఇండియా' అనే సినిమాను ప్రకటించారు. ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ సంయుక్తం తెరకెక్కిస్తున్నారు.

ఈ చిత్రాన్ని మాటల రచయత డైమండ్ రత్నబాబు డైరెక్ట్ చేయబోతున్నాడు. ఆ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేశారు. 'సన్ ఆఫ్ ఇండియా' అనే టైటిల్‌ను బట్టి చూస్తుంటే.. ఇది దేశ భక్తి నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రం అనే విషయం స్పష్టమవుతోంది.దీనిపై మరింత చదవండి :