'ఆచార్య' సెట్‌లో చిరంజీవిని కలిసిన మోహన్‌బాబు
మెగాస్టార్ చిరంజీవిని కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు కలుసుకున్నారు. ఆ ఇద్దరూ చిరకాల మిత్రులనే విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి 'ఆచార్య' సినిమా చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఆ సినిమా షూటింగ్ జరుగుతోంది.
బుధవారం మోహన్‌బాబు 'ఆచార్య' సెట్స్ దగ్గరకు వెళ్లి, చిరంజీవికి బొకే ఇచ్చి, స్నేహపూర్వకంగా కలిశారు. చిరకాల మిత్రుడు తన సినిమా సెట్స్‌కు రావడంతో చిరంజీవి ఆనందంతో మోహన్‌బాబును ఆహ్వానించారు. ఆ ఇద్దరూ కొద్దిసేపు సినిమాలతో పాటు వివిధ అంశాలపై మాట్లాడుకున్నారు. మోహన్‌బాబు ప్రస్తుతం 'సన్ ఆఫ్ ఇండియా' మూవీ చేస్తున్నారు.