గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 23 డిశెంబరు 2020 (15:56 IST)

"ఎస్‌బిఎస్‌బి"కి మెగాస్టార్ చిరంజీవి ముందస్తు శుభాకాంక్షలు

కరోనా లాక్డౌన్ తర్వాత నేరుగా థియేటర్లలో విడుదలవుతున్న చిత్రం సోలో బ్రతుకే సో బెటర్. మెగా ఫ్యామిలీ హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన ఈ చిత్రం ఈ నెల 25వ తేదీన క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ముఖ్యంగా లాక్డౌన్ తర్వాత థియేటర్లలో విడులవుతున్న తొలి తెలుగు చిత్రం ఇదే కావడం గమనార్హం. దీంతో చిత్ర యూనిట్‌కు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు.
 
ఇదే అంశంపై ఆయన ఓ ట్వీట్ చేశారు. "ఈ చిత్రానికి లభించే ఆదరణ మొత్తం చిత్ర పరిశ్రమలోనే స్ఫూర్తిని, స్థైర్యాన్ని కలిగిస్తుందనడంలో సందేహం లేదన్నారు. ప్రేక్షకులందరూ బాధ్యతగా ఫేస్ మాస్క్‌లు ధరించి, సామాజిక దూరాన్ని పాటిస్తూ సోలో బ్రతుకే సో బెటర్ చిత్రాన్ని థియేటర్స్‌లో ఎంజాయ్ చేయాలని కోరారు". మెగాస్టార్ విష్‌పై స్పందించిన తేజ్ కృతజ్ఞతలు తెలిపారు. మీ సపోర్ట్, బ్లెస్సింగ్స్ తమకెప్పుడూ ఉండాలని కోరాడు.