మొదలైన మోహనకృష్ణ ఇంద్రగంటి మల్టీసారర్ మూవీ!
అర్థవంతమైన చిత్రాలకు పెట్టింది పేరు మోహనకృష్ణ ఇంద్రగంటి. "జెంటిల్‌మెన్" వంటి సూపర్ హిట్ అనంతరం అడివి శేష్-అవసరాల శ్రీనివాస్‌లు హీరోలుగా "ఏ గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్" పతాకంపై ఓ మల్టీ స్టారర్‌ను తెరకెక్క
అర్థవంతమైన చిత్రాలకు పెట్టింది పేరు మోహనకృష్ణ ఇంద్రగంటి. "జెంటిల్‌మెన్" వంటి సూపర్ హిట్ అనంతరం అడివి శేష్-అవసరాల శ్రీనివాస్‌లు హీరోలుగా "ఏ గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్" పతాకంపై ఓ మల్టీ స్టారర్‌ను తెరకెక్కించనున్నారు. కె.సి.నరసింహారావు నిర్మించనున్న ఇంకా టైటిల్ నిర్ణయించని ఈ చిత్రంలో "అంతకు ముందు ఆ తర్వాత" ఫేమ్ ఈష, అదితి మ్యానికల్ కథానాయికలుగా నటించనుండగా.. యంగ్ అండ్ టాలెంటెడ్ కమెడియన్ వెన్నెల కిషోర్ ఓ ముఖ్యపాత్ర పోషించనున్నాడు.
ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రం ప్రారంభోత్సవం బుధవారం జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి సీనియర్ ప్రొడ్యూసర్ శివలెంక కృష్ణప్రసాద్ క్లాప్ కొట్టగా వినయ్ కెమెరా స్విచాన్ చేశారు. తనికెళ్ళ భరణి గౌరవ దర్శకత్వం వహించారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత "ఏ గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్" సంస్థ అధినేత కె.సి.నరసింహారావు మాట్లాడుతూ "నేడు పూజా కార్యక్రమాలతోపాటు రెగ్యులర్ షూట్ కూడా మొదలుపెట్టనున్నాం. అడివి శేష్, అవసరాల శ్రీనివాస్‌లు కథానాయకులుగా నటిస్తున్న ఈ చిత్రంలో ఈష, అదితి మ్యానికల్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. మణిశర్మ సంగీత సారథ్యం వహించనున్న ఈ చిత్రానికి పి.జి.విందా కెమెరా బాధ్యతలు నిర్వహించనున్నారు" అన్నారు.