అన్నీ డబ్బు కోసమే కాదు : తమన్నా
ఒకవైపు కథానాయికగా కొనసాగుతూనే మరోవైపు ఐటెమ్ సాంగ్‌లు కూడా చేయడంలో మిల్కీ బ్యూటీ తమన్నా ఎప్పుడూ ముందుంటుంది. ఇప్పటికే చాలా సినిమాల్లో ఐటెమ్ సాంగ్స్ చేసింది. అయితే, అవకాశాలు తగ్గిపోవడంతో కేవలం డబ్బు కోసమే ఐటెమ్ సాంగ్‌లు చేస్తోందంటూ తనపై వస్తున్న విమర్శలపై తమన్నా తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించింది.
"నేను హీరోయిన్‌గా నటించే సమయంలో ఎంత సంతృప్తి చెందుతానో ఐటెమ్ సాంగ్‌లు చేసేటప్పుడు కూడా అంతే సంతృప్తి పొందుతాను. నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. డ్యాన్స్ వేసే ఏ అవకాశాన్నీ వదులుకోను. నటించేటపుడు ఎంత సంతృప్తి ఉంటుందో డ్యాన్స్ వేసేటపుడు కూడా అంతే ఉంటుంది. కేవలం డబ్బు కోసమే నేను ఐటెమ్ సాంగ్‌లు చేస్తున్నాననడం నిజం కాద' అని తమన్నా చెప్పుకొచ్చింది. మరి ఇందులో ఎంత నిజముందో.