శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 3 ఫిబ్రవరి 2021 (18:07 IST)

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌‌ను రీషూట్ చేస్తారా?

అఖిల్ అక్కినేని హీరోగా చేస్తున్న సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. ఈ సినిమాలో అఖిల్ సరసన బుట్టబొమ్మ పూజ హేగ్డే నటించారు. ఈ సినిమా చాలా కొత్త థీమ్‌తో తెరకెక్కించారు. కానీ ఈ సినిమా విడుదల విషయంపై మాత్రం క్లారిటీ లేదు. ఈ సినిమా విడుదల ఆలస్యానికి కారణాలుగా అనేక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 
 
అయితే ఈ సినిమా ఔట్‌పుట్ విషయంలో నాగ్ సంతృప్తి చెందలేదని, అఖిల్ కెరీర్‌కి ఈ సినిమా ఎంత ముఖ్యమో గుర్తు ఉంచుకొని సినిమాను సరిచేయమని కొన్ని మార్పులు చెప్పారని వార్తలు వినిపిస్తున్నాయి. 
 
అందుకోసం కొన్ని సన్నివేశాలను రీ షూట్ చేసేందుకు చూస్తున్నారు. అందుకనే సినిమా ఆలస్యం అవుతుందని సమాచారం. కారణం ఏదైనా ఈ సినిమా కోసం అక్కినేని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా జూన్‌లో విడుదలయ్యేందుకు అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.