గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 23 డిశెంబరు 2022 (17:26 IST)

అత్యంత బాధాకరం : ఛత్తీస్ ఘడ్ నుంచి జయప్రద

kaikala-jayapradha
kaikala-jayapradha
కైకాల సత్యనారాయణ గారి మరణం వ్యక్తిగతంగా తనకు తీరని లోటని అన్నారు ప్రముఖ నటి జయప్రద. ఈ విషాద వార్త తనను తీవ్రంగా కలచి వేసిందని ఆమె పేర్కొన్నారు. "అడవిరాముడు, యమగోల" తదితర ఎన్నో చిత్రాల్లో కలిసి నటించినప్పటి జ్ఞాపకాలను ఆమె నెమరువేసుకున్నారు. నటనకు నిఘంటువు వంటి సత్యనారాయణ స్థానం తెలుగు చిత్రసీమలో చెక్కు చెదరనిదని ఆమె పేర్కొన్నారు. 
 
కైకాల సత్యనారాయణ గారి మరణం వార్త వినగానే ఆచర్యం కలిగిందని పేర్కొన్నారు. ఛత్తీస్ ఘడ్ మారుమూల ప్రాంతంలో షూటింగ్ లో ఉన్న ఆమె తన ప్రద సానుభూతిని తెలిపారు.  కైకాల కుటుంబ సభ్యులకు జయప్రద సంతాపం తెలియజేశారు.