గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 9 ఏప్రియల్ 2024 (12:05 IST)

మా ఎన్నికలు జరపాలి : నాగబాబు - అధ్యక్షుడిగా విష్ణు మంచు కొనసాగింపు

Nagababu-vishnu
Nagababu-vishnu
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కాలపరిమితి అయినా ఎన్నికలు జరగకుండా జాప్యం చేయడం పట్ల  నాగబాబు ఇటీవలే మండి  పడ్డారు. టీవీ అసోసియేషన్ మీటింగ్ జరిగినప్పుడు నటీనటులను మీ నాయకుడిని మీరు ఏమి అడిగారా.. ఎన్నికలు జరపాలికదా.. అంటూ కోరారు. కానీ తాజాగా మంచువిష్ణు ఆదివారం జరిగిన మా సమావేశంలో కీలక నిర్ణయం చేసుకున్నారు. 
 
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) జనరల్ బాడీ మీటింగ్ ఆదివారం జరిగింది. ఈ మీటింగ్‌లో అనేక విషయాలు చర్చల్లోకి వచ్చాయి. ‘మా’ బిల్డింగ్ ప్రాజెక్ట్ పూర్తయ్యే వరకు ప్రస్తుత నాయకత్వం, గౌరవనీయులైన ప్రెసిడెంట్ విష్ణు మంచు మార్గదర్శకత్వంలోనే కొనసాగుతుందని ఏకగ్రీవంగా తీర్మానించారు. 
 
సుమారు 400 మంది గౌరవనీయ సభ్యులు హాజరైన ఈ సమావేశంలో మేలో జరగబోయే ఎన్నికలు, జూలైలో జరగనున్న నిధుల సేకరణ కార్యక్రమం, ‘మా’ భవన నిర్మాణంలో కొనసాగుతున్న వివిధ ముఖ్యమైన విషయాలను ప్రస్తావించారు.
 
‘మా’ భవనం విజయవంతంగా పూర్తయ్యే వరకు అధ్యక్షుడు విష్ణు మంచు నేతృత్వంలోని ప్రస్తుత కమిటీ పదవీకాలాన్ని పొడిగించాలనే ప్రతిపాదన ముందుకు వచ్చింది. ఈ ప్రతిపాదనకు ప్రస్తుత సభ్యులందరి నుంచి ఏకగ్రీవ మద్దతు లభించింది. ఇది ప్రస్తుత నాయకత్వంపై అచంచలమైన విశ్వాసాన్ని సూచిస్తుంది.
 
తమపై ఇంతటి విశ్వాసాన్ని ఉంచిన సభ్యులందరికీ విష్ణు మంచు కృతజ్ఞతలు తెలిపారు. మా అధ్యక్షుడు విష్ణు మంచు తన ప్యానెల్ సభ్యులకు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. తనకు, తన ప్యానెల్‌కు అప్పగించిన బాధ్యతను విష్ణు మంచు గుర్తించి ‘మా’సభ్యులందరి అభివృద్ధి, సంక్షేమం కోసం పాటు పడతామని ప్రతిజ్ఞ చేశారు. . 
 
ప్రెసిడెంట్ విష్ణు మంచు నేతృత్వంలోని నాయకత్వాన్ని కొనసాగించాలనే నిర్ణయం అసోసియేషన్ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని,  ఈ కీలక దశలో స్థిరత్వం, పురోగతిని సాధించడం కోసం సమిష్టి నిబద్ధతను  చాటి చెబుతుంది.