శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : శనివారం, 13 మే 2017 (15:17 IST)

'రామ్మా చిలకమ్మా' పాటను చిరంజీవి వద్దన్నారు.. ఎవరి దగ్గర చేతులు కట్టుకుని పనిచేయను: మణిశర్మ

సంగీత దర్శకుడు, మెలోడీ బ్రహ్మ మణిశర్మ టాప్ హీరోల నుంచి కుర్ర హీరోల వరకు సంగీతం సమకూర్చారు. తాజాగా ఆయనకు అవకాశాలు తగ్గిపోతూ వచ్చాయి. ఒకప్పుడు ఇండస్ట్రీని షేక్ చేసే సంగీతం సమకూర్చిన మణిశర్మను ప్రస్తుతం

సంగీత దర్శకుడు, మెలోడీ బ్రహ్మ మణిశర్మ టాప్ హీరోల నుంచి కుర్ర హీరోల వరకు సంగీతం సమకూర్చారు. తాజాగా ఆయనకు అవకాశాలు తగ్గిపోతూ వచ్చాయి. ఒకప్పుడు ఇండస్ట్రీని షేక్ చేసే సంగీతం సమకూర్చిన మణిశర్మను ప్రస్తుతం పట్టించుకునే వారు లేకపోయారు. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో మణిశర్మ మాట్లాడారు. ప్రస్తుతం వస్తున్న తెలుగు పాటలపై, ట్యూన్స్‌పై సంచలన కామెంట్స్ చేశారు.
 
ప్రస్తుతం పాటల స్థాయి తగ్గడానికి గల కారణం హీరోలేనని చెప్పేశారు. హీరోల నిర్ణయాలకు అనుగుణంగా పాటల్ని ట్యూన్ చేయాల్సిన పరిస్థఇతులు ఏర్పడటంతో నేటి సినిమాల పాటల స్థాయి దిగజారిపోయిందంటూ మణిశర్మ ఘాటుగా విమర్శించారు. ఇదే సందర్భంలో మెగాస్టార్ చిరంజీవిపై కూడా మణిశర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. 
 
చిరంజీవి ఆల్ టైం హిట్ పాటల్లో 'చూడాలని ఉంది' లోని 'రామ్మా చిలకమ్మా' సాంగ్ గురించి మాట్లాడుతూ ఉదిత్ నారాయణ పాడిన ఈ పాట ఆ సినిమా నుండి తొలిగించమని చిరంజీవి చెప్పినా తాను వినకుండా అదే పాటను ఆ సినిమాలో ఉంచడంతో ఆపాట అప్పట్లో బంపర్ హిట్ అయ్యిందని మణిశర్మ గుర్తు చేశారు. 
 
అప్పట్లో టాప్ హీరోలు సంగీత దర్శకుడు చెప్పే మాటకు గౌరవం ఇచ్చేవారని ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేవన్నారు. ఫిలిమ్ ఇండస్ట్రీలో ప్రస్తుత వాతావరణానికి ఇమడలేక తాను చాలా అవకాశాలు వదులుకున్నానని మణిశర్మ అన్నారు. తనకు కథే ముఖ్యమని.. హీరోలు చెప్పే విధంగా బాణీలు, వారి ఛాయిస్ వల్ల సంగీతానికి కథతో సందర్భాలతో పనిలేకుండా పోతోంది. దీని వల్ల సంగీత దర్శకులపై ఒత్తిడి ఎక్కువైంది. 
 
అందుకే తాను చిన్న దర్శకులతో పనిచేస్తున్నానని మణిశర్మ వివరించారు. చిన్న సినిమాల్లో వచ్చే పాటలే బాగున్నాయని.. ఇతరుల దగ్గర చేతులు కట్టుకుని పనిచేయలేనని.. ఎవరి దయతోనూ తాను బతకడం లేదని మణిశర్మ షాకింగ్ కామెంట్స్ చేశారు.