ఆస్కార్ 2021లో నామినేట్ చేయబడి తప్పనిసరిగా చూడాల్సిన చిత్రాలు
అకాడమీ అవార్డులంటేనే అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డులని సినీ రంగ ప్రముఖులు భావిస్తుంటారు. ప్రతి సంవత్సరం ఆలోచనాత్మకమైన కథలతో పాటుగా ఆకట్టుకునే పాత్రలు సైతం ఈ అవార్డుల రేస్‌లో పోటీపడుతుంటాయి. 2002లో లగాన్ తరువాత ఈ సంవత్సరం వైట్ టైగర్ చిత్రం ఆస్కార్ 2021లో ఇండియా నుంచి పోటీపడుతుంది.
దాదాపు 20 సంవత్సరాల తరువాత ఇండియన్ మూవీ పోటీపడుతున్న ఈ అవార్డుల రేస్‌లో పోటీపడుతున్న చిత్రాలెన్నో ఉన్నాయి. దేనికి అవార్డు వరించింది... ఎవరిని ఈ అవార్డు కాదనుకుంది తెలుసుకోవాలనుకుంటే ఏప్రిల్ 26వ తేదీ ఉదయం 5.30 గంటలకు అనుసరించి రాత్రి 8.30 గంటలకు స్టార్ మూవీస్, స్టార్ వరల్డ్ ఛానెల్స్‌పై ప్రసారమయ్యే అవార్డుల వేడుకలను తిలకించడమే.
అవార్డుల వేడుకకు ఇంకా కొద్ది రోజులే మిగిలిన వేళ ఈ అకాడమీ అవార్డులలో పోటీపడుతున్న చిత్రాలను ఓసారి పరిశీలిస్తే...
1. ద పాధర్: ఫ్లోరియన్ జెల్లర్ ప్లే లీ పీరీ ఆధారంగా తీర్చిదిద్దారు. వయసు మీద పడిన తండ్రి నెమ్మదిగా అన్నీ మరిచిపోతుండటం... ఈ నేపథ్యంలో కనిపించే భావోద్వేగాలు. ఆంథోనీ హోప్కిన్స్ ప్రదర్శనకు పరాకాష్ట అనతగ్గ రీతిలో ఉంటుందిది.
2. జుడాస్ అండ్ ద బ్లాక్ మెసయ్య: చారిత్రాత్మక బయోపిక్ ఇది. దర్శకత్వం మొదలు, చిత్ర నటీనటుల ఎంపిక, నటన, స్ర్కిప్ట్... ప్రతిఒక్కటీ అద్భుతమే!
3. మంక్: డేవిడ్ ఫించర్ దర్శకత్వం వహించిన చిత్రమిది. విశేషమేమిటంటే ఈ చిత్ర స్ర్కీన్‌ప్లేను ఆయన తండ్రి జాక్ ఫించర్ తీర్చిదిద్దడం. ఇటీవలనే ఆయన మరణించారు.
4. ద వైట్ టైగర్: లగాన్ తరువాత ఇండియా నుంచి ఆస్కార్‌కు నామినేట్ కాబడ్డ చిత్రమిది. రాజ్‌కుమార్ రావు, ప్రియాంక చోప్రా లాంటి తారాగణం ఉన్న ఈ చిత్రంలో సామాన్యుని జీవితం ఒడిసిపట్టారు. స్లమ్‌డాగ్ మిలియనీర్, పారాసైట్‌ల సమ్మేళనంలా కనిపిస్తుందీ చిత్రం.
5. మినారీ: లీ ఇసాక్ రచన-దర్శకత్వం వహించిన చిత్రమిది. కొరియన్-అమెరికన్ ఫ్యామిలీ చిత్రమిది. స్ఫూర్తిదాయక కుటుంబ కథా చిత్రాలలో ఒకటి. రోజువారీ సగటు అమెరికన్ జీవిత గాథను ఇది వెల్లడిస్తుంది.
6. నోమడ్‌ల్యాండ్: అందాన్ని ఆస్వాదించాలనుకునే వారు తప్పనిసరిగా చూడాల్సిన చిత్రమది.
7. ప్రామిసింగ్ యంగ్ ఉమెన్: ఊహాతీత సంఘటనలతో కూడిన కథనం ఈ చిత్రబలం.
8. సౌండ్ ఆఫ్ మెటల్: హెవీ మెటల్ డ్రమ్మర్ జీవితంపై దృష్టి సారించిన చిత్రమిది.
9. ద ట్రయల్ ఆఫ్ ద చికాగో 7: కోర్ట్ రూమ్ డ్రామాలను ఇష్టపడే వారిని ఆకట్టుకునే రీతిలో ఉంటుంది.