కరోనా ఎఫెక్ట్ `ఆచార్య' షూటింగ్ బ్రేక్!
ఇటీవల కరోనా సెకండ్‌వేవ్ హైదరాబాద్‌లోనూ వ్యాపించింది. సినీప్రముఖులకు కరోనా పాజిటివ్ కూడా వచ్చింది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి సినిమా `ఆచార్య` షూటింగ్‌కు ఆ సెగ తగిలింది. వారం క్రితం సోనూసూద్ ఆ సినిమా షూటింగ్ నిమిత్తం సైకిల్‌పై కోకాపేట వెళ్ళారు. ఆ మరుసటిరోజు తనకు పాజిటివ్ వచ్చిందని ఆయన ప్రకటించారు. ఆ తర్వాత సినీపరిశ్రమలో ఆచార్య సినిమా షూటింగ్ బ్రేక్ పడిందని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత రోజు కూడా షూటింగ్ యథావిధిగా జరిగింది. పరిమిత సభ్యులు, టెక్నీషియన్స్ ఆధ్వర్యంలో కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. కాగా, సోమవారంనాడు కోకాపేటలో ఆచార్య సెట్ బోసిబోయింది. ఈ విషయమై చుట్టుపక్కలవారి సమాచారం మేరకు షూటింగ్ కరోనా వల్ల బ్రేక్ పడిందని తెలియజేశారు.
సోమవారం సాయంత్రానికి 'ఆచార్య' షూటింగ్ కు స్మాల్ బ్రేక్ ను దర్శక నిర్మాతలు ప్రకటించినట్లుగా తెలిసింది. మెగాస్టార్ చిరంజీవి, కాజల్ జంటగా నటిస్తున్న చిత్రం 'ఆచార్య'. ఈ సినిమాలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, పూజా హెగ్డే సైతం కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ప్రధాన తారాగణం పాల్గొంటుండగా ఈ సినిమా షూటింగ్ కోకాపేటలో జరుగుతోంది. కొరటాల శివ దర్శకత్వంలో రామ్ చరణ్ తో కలిసి నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.