1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్

'పుష్ప'రాజ్‌ను డైరెక్ట్ చేయనున్న 'ఆచార్య' దర్శకుడు!

స్టైరిష్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా పుష్ప అనే చిత్రంలో నటిస్తున్నారు. కె.సుకుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం తర్వాత ఆయన ఆచార్య చిత్ర దర్శకుడు కొరటాలశివ దర్శకత్వంలో నటించేందుకు కమిట్ అయ్యారు. ఈ సినిమాను యువసుధ ఆర్ట్స్‌‌ పాటు గీతా ఆర్ట్స్‌‌లో ఓ విభాగమైన జీఏ2 అఫీషియల్‌ కలిసి నిర్మించనున్నట్లు సమాచారం.
 
ఈ మేరకు ఈ చిత్రం ఏప్రిల్‌ 2022 తర్వాత పట్టాలెక్కనున్నట్లు యువసుధ ఆర్ట్స్‌ వెల్లడించింది. తనదైన స్టైల్‌తో అభిమానుల్ని ఆకట్టుకునే అల్లు అర్జున్‌, సామాజిక కోణానికి కమర్షియల్‌ హంగులు అద్ది ప్రజల్ని కట్టిపడేసే డైరెక్టర్‌ కొరటాల శివ కాంబినేషన్‌లో సినిమా రాబోతోందంటే సర్వత్రా ఆసక్తి  నెలకొంది.
 
ఇప్పటికే విడుదలైన 'పుష్ప' సినిమా ట్రైలర్‌లో అల్లు అర్జున్‌ పూర్తి మాస్‌ లుక్‌లో అందరినీ కట్టిపడేస్తున్న విషయం తెలిసిందే. మరి కొత్త సినిమాలో ఆయన పాత్ర ఎలా ఉండబోతుందో చూడాలి. ఈ సినిమా కథ రాజకీయ నేపథ్యంలో కొనసాగే అవకాశం ఉందని ఊహాగానాలు ఊపందుకున్నాయి.