గురువారం, 5 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By chitra
Last Updated : సోమవారం, 19 సెప్టెంబరు 2016 (13:49 IST)

''ఖైదీ నంబ‌ర్ 150''లో విజయ్ మాల్యా విలన్‌గా నటిస్తున్నాడా? నిజమేనా?

''ఖైదీ నంబ‌ర్ 150''లో విజయ్ మాల్యా విలన్‌గా నటిస్తున్నాడా? నిజమేనా? అనుకుంటున్నారు కదూ.. నిజమేనండి. కానీ మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ 150లో విజయ్ మాల్యాగా నటిస్తున్నట్లు బాలీవుడ్ నటుడు తరుణ్ అరోరో

''ఖైదీ నంబ‌ర్ 150''లో విజయ్ మాల్యా విలన్‌గా నటిస్తున్నాడా? నిజమేనా? అనుకుంటున్నారు కదూ.. నిజమేనండి. కానీ మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ 150లో విజయ్ మాల్యాగా నటిస్తున్నట్లు బాలీవుడ్ నటుడు తరుణ్ అరోరో అన్నాడు. ఈ సినిమాలో త‌న న‌ట‌న మొత్తం విజ‌య్ మాల్య త‌ర‌హా సూట్లలోనే కనిపిస్తానని, విజయ్ మాల్యా లైఫ్ స్టైల్ త‌న పాత్ర‌లో ప్ర‌తిబింబిస్తుంద‌ని చెప్పుకొచ్చాడు. 
 
తమిళంలో నీల్ నితిన్ ముఖేష్ చేసిన ఆ పాత్రను.. తెలుగులో తరుణ్ అరోరా చేయబోతున్నాడు. తెలుగులో తొలిసారి నటించే అవకాశం దక్కినందుకు హర్షం వ్యక్తం చేస్తున్నాడు. త‌మిళంలో కంటే తెలుగులో ఈ విల‌న్ పాత్ర‌ టేకింగ్ కాస్త‌ భిన్నంగా ఉంటుందని అరోరా చెప్పాడు. చిరంజీవితో కల‌సి చేసిన సన్నివేశాలు చాలా తక్కువని అంజలి మొగుడు జావేరీ చెప్పుకొచ్చాడు.