శనివారం, 25 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By dv
Last Updated : మంగళవారం, 17 జనవరి 2017 (13:47 IST)

నాలుగో షెడ్యూల్‌లో బిజీగా ఉన్న “ఏంజెల్”

'మన్యంపులి' వంటి సూపర్ హిట్ తర్వాత శ్రీ సరస్వతి ఫిల్మ్స్ బ్యానర్‌పై తెరకెక్కుతోన్న సోషియోఫాంటసీ ఎంటర్‌టైనర్ 'ఏంజెల్'. గతేడాది షూటింగ్ మొదలుపెట్టిన ఈ చిత్ర యూనిట్ ఇప్పటికే మూడు షెడ్యూల్స్ దిగ్విజయంగా ప

'మన్యంపులి' వంటి సూపర్ హిట్ తర్వాత శ్రీ సరస్వతి ఫిల్మ్స్ బ్యానర్‌పై తెరకెక్కుతోన్న సోషియోఫాంటసీ ఎంటర్‌టైనర్ 'ఏంజెల్'. గతేడాది షూటింగ్ మొదలుపెట్టిన ఈ చిత్ర యూనిట్ ఇప్పటికే మూడు షెడ్యూల్స్ దిగ్విజయంగా పూర్తిచేసుకొని తాజాగా జనవరి 16 నుంచి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో నాలుగో షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటోంది.
 
యంగ్ టాలెండ్ హీరో నాగ అన్వేష్, బ్యూటీ క్వీన్ హెబ్బా పటేల్ జంటగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకి దర్శకధరీడు రాజమౌళి అసోసియేట్ 'బాహుబలి' పళని దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ప్రస్తుతం జరుగుతోన్న షెడ్యూలని జనవరి నెలాఖరు వరకు నిర్విహించేందుకు ప్లాన్ చేస్తున్నట్లుగా ఈ చిత్ర నిర్మాత భువన్ సాగర్ తెలిపారు. 
 
ఈ సినిమాలో సప్తగిరి, ప్రదీప్ రావత్, షియాజీ షిండే కీలక పాత్రలు పోషిస్తున్నారు. బెంగాల్ టైగర్ ఫేమ్ భీమ్స్ సెస్సరోలియో ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. ముప్పా వెంగయ్య చౌదరి సమర్పణలో సరస్వతి ఫిల్మ్స్ బ్యానర్ పై భువన్ సాగర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రచన : శ్రీనివాస్ లంకపల్లి, ఆర్ట్‌: వి.ఎస్. సాయిమణి, స్టంట్స్‌: రామ్ లక్ష్మణ్, డైలాగ్స్‌: వేంపల్లి రమేశ్ రెడ్డి, ఎడిటర్‌: చోట.కె.ప్రసాద్, సినిమాటోగ్రఫీ: గుణ.