1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 20 సెప్టెంబరు 2023 (16:41 IST)

నాగ చైతన్య, సాయి పల్లవి కాంబినేషన్ లో గీతా ఆర్ట్స్ సినిమా

Naga Chaitanya, Sai Pallavi, Chandu Mondeti, Allu Aravind, Bunny Vasu
Naga Chaitanya, Sai Pallavi, Chandu Mondeti, Allu Aravind, Bunny Vasu
నాగ చైతన్య, దర్శకుడు చందూ మొండేటి పాన్ ఇండియా చిత్రం #NC23 ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దాదాపు నెల రోజుల క్రితమే ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభించిన టీమ్, త్వరలోనే సినిమా షూటింగ్‌ని ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తోంది. బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, తెలుగుతో పాటు హిందీలో అనేక కల్ట్ హిట్‌లను అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్‌ బ్యానర్ పై నిర్మాత అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని సగర్వంగా సమర్పిస్తున్నారు.
 
Sai Pallavi,  Allu Aravind
Sai Pallavi, Allu Aravind
ప్రీ-ప్రొడక్షన్ వర్క్స్‌లో భాగంగా, నిన్న సినిమాలో హీరోయిన్ కూడా టీమ్‌తో జాయిన్ అయ్యారు. అయితే ఈ రోజు మేకర్స్ ఆమె ఎవరో వెల్లడించారు. వెరీ బ్యూటీఫుల్, ట్యాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కనున్న ఈ ప్రతిష్టాత్మక సినిమాలో హీరోయిన్ గా టీంలో చేరారు. నాగచైతన్య, సాయి పల్లవి గతంలో సూపర్ హిట్ ‘లవ్ స్టోరీ’ చిత్రంలో కలిసి పనిచేశారు. కొత్త సినిమాలో తమ అద్భుతమైన కెమిస్ట్రీతో మనల్ని ఉర్రూతలూగించబోతున్నారు.
 
#NC23 నాగ చైతన్య, చందూ మొండేటి ఇద్దరికీ అత్యంత భారీ బడ్జెట్ చిత్రం అవుతుంది. హై ప్రొడక్షన్, టెక్నికల్ స్టాండర్డ్స్‌తో గ్రాండ్‌గా ఈ సినిమా రూపొందనుంది. కేవలం ప్రీ ప్రొడక్షన్ పనులకే నిర్మాతలు మంచి బడ్జెట్‌ను వెచ్చిస్తున్నారు.
 
ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను మేకర్స్ త్వరలో అనౌన్స్ చేస్తారు.