బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : బుధవారం, 8 నవంబరు 2017 (09:06 IST)

పెళ్లై నెలైంది.. సమంత కోసం.. మళ్లీ వంట చేసి సర్‌ప్రైజ్ ఇచ్చిన నాగచైతన్య

టాలీవుడ్ ప్రేమపక్షులు సమంత, నాగచైతన్య దంపతులైన సంగతి తెలిసిందే. ఈ జంట ప్రస్తుతం మినీ హనీమూన్‌ను ఎంజాయ్ చేస్తోంది. ఇటీవలే అక్కినేని కోడలు సమంత వంట చేసింది. ఆ వంట తిని ఎవరికీ ఏమీ కాలేదని చెప్పింది. తాజా

టాలీవుడ్ ప్రేమపక్షులు సమంత, నాగచైతన్య దంపతులైన సంగతి తెలిసిందే. ఈ జంట ప్రస్తుతం మినీ హనీమూన్‌ను ఎంజాయ్ చేస్తోంది. ఇటీవలే అక్కినేని కోడలు సమంత వంట చేసింది. ఆ వంట తిని ఎవరికీ ఏమీ కాలేదని చెప్పింది. తాజాగా పెళ్లికి ముందు ప‌లుసార్లు త‌న కోసం వంట చేస్తుండ‌గా స‌మంత త‌న సోష‌ల్ మీడియా ఖాతాల్లో నాగ‌చైత‌న్య పోటోల‌ను పోస్ట్ చేసి అల‌రించింది.

పెళ్లైన తర్వాత కూడా నాగచైతన్య సమంత కోసం స్వయంగా మరోసారి ప్రత్యేక వంట చేశాడు.  వివాహం జరిగి సరిగ్గా ఒక నెల కావొస్తుండటంతో.. త‌న‌కు త‌న భ‌ర్త సర్‌ప్రైజ్ ఇచ్చాడ‌ని, సమంత ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తెలిపింది. తాను ప్రపంచంలోనే అతి ఉత్తమ వ్యక్తిని పెళ్లి చేసుకున్నానని, ఈ జీవితం ఎంతో హ్యాపీగా ఉంద‌ని చెప్పింది. సినీన‌టులు నాగచైతన్య, సమంత అక్టోబర్ ఆరో తేదీన వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.
 
పెళ్లి తరువాత సినిమాల్లో నటించాలని నిర్ణయించుకున్న ఆ అందాల భామ. ఈ విషయంలో ముందుగానే ఒక నిర్ణయం కూడా తీసుకుందట. స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతుండగానే యంగ్ హీరో నాగచైతన్యను పెళ్లాడి అక్కినేని ఇంటి కోడలిగా మారిపోయింది సమంత. అయితే పెళ్లి తరువాత కూడా సినిమాల్లో నటించడం కొనసాగిస్తానని ఈ క్రేజీ హీరోయిన్ క్లారిటీ ఇచ్చింది. అక్కినేని ఫ్యామిలీ కూడా ఇందుకు అభ్యంతరం చెప్పకపోవడంతో సమంత హవా మరికొన్నాళ్లు కొనసాగే అవకాశం ఉందని సినీజనం భావిస్తున్నారు. అయితే పెళ్లి తరువాత సమంత ఎంతకాలం హీరోయిన్‌గా కొనసాగుతుందనే విషయంలో మాత్రం ఎవరికీ అంతగా స్పష్టత లేదు.
 
మరోవైపు ప్రస్తుతం నటిస్తున్న సినిమాలు పూర్తయిన తరువాత సమంత మెయిన్ హీరోయిన్‌గానే సినిమాలు ఒప్పుకుంటుందా అనే అంశంపై కూడా సస్పెన్స్ కొనసాగుతోంది. ఫ్యామిలీ లైఫ్‌లోకి పూర్తి స్థాయిలో ఎంటరైతే మళ్లీ సినిమాల్లో నటించడం కష్టమని భావించిన సమంత పెళ్లి తరువాత రెండేళ్లు మాత్రమే సినిమాల్లో కొనసాగాలని డిసైడైనట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్.