శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : మంగళవారం, 31 అక్టోబరు 2017 (16:59 IST)

మినీ హనీమూన్‌కు వెళ్లిన సమంతకు గుడ్ న్యూస్: ట్విట్టర్లో 5 మిలియన్ల ఫాలోవర్స్...

టాలీవుడ్ ప్రేమపక్షలు నాగచైతన్య, సమంత జోడీ మినీ హనీమూన్‌ కోసం లండన్‌ వెళ్లింది. భర్తతో కలిసి హనీమూన్‌లో వుంటున్న ఉన్న సమంత.. రెండు ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. తన చేతికి ఉన్న డైమండ్ రింగ్, భ

టాలీవుడ్ ప్రేమపక్షలు నాగచైతన్య, సమంత జోడీ మినీ హనీమూన్‌ కోసం లండన్‌ వెళ్లింది. భర్తతో కలిసి హనీమూన్‌లో వుంటున్న ఉన్న సమంత.. రెండు ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. తన చేతికి ఉన్న డైమండ్ రింగ్, భర్త నాగ చైతన్య ఫొటోలను సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. వీటికి నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది. 
 
గోవాలో అక్టోబర్ 6న హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లాడిన చైతూ, సమ్మూ జోడీ... అక్టోబర్ 8వ తేదీన క్రిస్టియన్ పద్ధతిలో తిరిగి వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం కొద్దిరోజుల పాటు లండన్‌లో వుండే ఈ కొత్త జంట తమ తమ చేతుల్లో వున్న సినిమాల షూటింగ్స్ పూర్తి చేసుకుని డిసెంబరులో ఎక్కువ రోజులు హాలీడే ట్రిప్పేయనున్నారని తెలిసింది. 
 
ఈ నేపథ్యంలో కొత్త పెళ్లి కూతురు సోషల్ మీడియాలో ఒకటైన ట్విట్టర్లో ఐదు మిలియన్ల ఫాలోవర్స్‌ను సాధించింది. ట్విట్టర్లో అభిమానులతో టచ్‌లో వుండే సమంతను ఐదు మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. దీంతో సమంతకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్స్ వెల్లువెత్తుతున్నాయి.