శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 5 ఆగస్టు 2023 (11:28 IST)

NC23 కోసం వైజాగ్ లో సముద్ర ప్రయాణం చేసిన నాగ చైతన్య

Naga Chaitanya sea voyage
Naga Chaitanya sea voyage
నాగ చైతన్య తను చేయబోయే కొత్త చిత్రం #NC23 కోసం సాగరతీరంలోని మత్స్యకారులని కలుస్తున్నారు. నిన్న శ్రీకాకుళం జిల్లా గార మండలం కె.మత్స్యలేశం గ్రామానికి వెళ్లి అక్కడి మత్స్యకారులను, వారి కుటుంబాలను కలుసుకుని వారి సంస్కృతి, జీవనశైలిని అర్థం చేసుకున్నారు.
 
ఈ రోజు దర్శకుడు చందూ మొండేటి, నిర్మాత బన్నీ వాస్ తో కలిసి వైజాగ్ పోర్టును సందర్శించారు నాగ చైతన్య. ఈ సందర్భంగా మత్స్యకారులతో కలసి బోటులో సముద్రంలోకి వెళ్లారు. సముద్రంలో వేట, ప్రయాణం, అక్కడ ఎదురయ్యే పరిస్థితి గురించి తెలుసుకున్నారు. సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభం కాకముందే ఇలా స్థానికులని కలసి వాస్తవ పరిస్థితులు తెలుసుకోని సహజత్వం ఉట్టిపడే చిత్రాలని అందించాలానే ప్రయత్నం పరిశ్రమకు మంచి పరిణామం.
 
ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కు కార్తికేయ 2తో పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్‌ను అందించిన చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. #NC23 అనే టైటిల్‌తో ఈ క్రేజీ ప్రాజెక్ట్ త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని సగర్వంగా సమర్పిస్తుండగా, టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాస్ నిర్మించనున్నారు. త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది.