ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : గురువారం, 1 ఫిబ్రవరి 2018 (10:22 IST)

నాకు సిగ్గెక్కువండి బాబోయ్.. నిహారికతో పెళ్లా?: నాగశౌర్య

''ఒక మనసు'' సినిమాలో మెగా హీరోయిన్ నిహారికతో నాగశౌర్య జతకట్టాడు. అప్పటి నుంచి నిహారికకు నాగశౌర్యకు ఏదో సంబంధం వుందని వస్తున్న వార్తలపై తాజాగా ''ఛలో'' సినిమా ప్రమోషన్‌లో నాగశౌర్య క్లారిటీ ఇచ్చాడు. కో-స

''ఒక మనసు'' సినిమాలో మెగా హీరోయిన్ నిహారికతో నాగశౌర్య జతకట్టాడు. అప్పటి నుంచి నిహారికకు నాగశౌర్యకు ఏదో సంబంధం వుందని వస్తున్న వార్తలపై తాజాగా ''ఛలో'' సినిమా ప్రమోషన్‌లో నాగశౌర్య క్లారిటీ ఇచ్చాడు. కో-స్టార్స్‌తో కలిసి పుకార్లు రావడం సహజమేనని నాగశౌర్య స్పష్టం చేశాడు. ఛలో సినిమా శుక్రవారం విడుదల కానున్న నేపథ్యంలో.. నిహారికతో తనకు పెళ్లంటూ వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని చెప్పాడు. 
 
ఇదే తరహాలో కళ్యాణ వైభోగమే హీరోయిన్ మాళవికతో, ఊహలు గుసగుసలాడే నాయిక రాశీఖన్నాతో, జూదుగాడు హీరోయిన్ సోనారికతో ప్రేమలో వున్నట్లు వందతులు సృష్టించారని తెలిపాడు. ఇలాంటి వార్తలు చికాకు పుట్టిస్తున్నాయని చెప్పాడు. తనకు ఎవరితో సంబంధాలు లేవని.. ఆడవాళ్లతో మాట్లాడాలంటేనే సిగ్గని తెలిపాడు. నాలుగేళ్ల తర్వాత అమ్మ చూసిన అమ్మాయినే నాగశౌర్య చెప్పాడు. తనది ప్రేమ వివాహం కాబోదని తేల్చి చెప్పేశాడు.