గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 18 ఏప్రియల్ 2021 (10:49 IST)

అల్లుడుకి ఖరీదైన బహుమతి ఇచ్చిన మెగా బ్రదర్

మెగా బ్రదర్ నాగబాబు తన అల్లుడుకు ఖరీదైన గిఫ్టును బహుమతిగా ఇచ్చారు. ఈ గిఫ్టు విలువ రూ.70 లక్షలు. దీనికి సంబంధించిన వీడియోని ఆయన నెట్టింట్లో పోస్ట్‌ చేశారు. ‘మా అల్లుడు చైతన్యకు ఇప్పటివరకూ ఎలాంటి బహుమతులివ్వలేదు. ఏదైనా ప్రత్యేకంగా ఇవ్వాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఇటీవల ఉగాదికి ఓ బహుమతి ఇద్దామనుకున్నాను.. కుదరలేదు. ఇప్పుడు అతడి కోసం ఓ రేంజ్‌రోవర్‌ డిస్కవరీ తీసుకున్నాం’ అని నాగబాబు తెలిపారు. నిహారిక-చైతన్య దంపతులను నాగబాబు దంపతులు కలిసి.. ఆ కారుని బహూకరించారు.
 
ఈ విషయాన్ని నాగబాబు శనివారం తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడించాడు. నా అల్లుడికి ఓ సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ అంటూ ఇన్‌స్టాలో పేర్కొన్నారు. ఈ మేరకు కూతురు నిహారిక, చైతన్యకు కారును డెలివరీ చేస్తున్న ఫోటోను షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో వైరల్‌గా మారింది. 
 
కాగా, నాగబాబు కుమార్తె నిహారికకు గుంటూరు మాజీ ఐజీ జె.ప్రభాకర్‌ రావు కుమారుడు చైతన్యతో వివాహం జరిగిన విషయం తెలిసిందే. గతేడాది డిసెంబర్‌ 9న రాజస్థాన్‌లోని ఉదయ్‌విలాస్‌లో వీరి వివాహం అత్యంత ఘనంగా జరిగింది. మెగా కుటుంబసభ్యులు, బంధువులు, సినీ పరిశ్రమకు చెందిన అతి తక్కువమంది ప్రముఖులు ఈ వివాహ వేడుకలో సందడి చేసిన విషయం తెలిసిందే.