ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 5 జనవరి 2024 (17:52 IST)

నా సామిరంగ లో స్నేహితులుగా నాగార్జున అక్కినేని, అల్లరి నరేష్

Nagarjuna Akkineni, Allari Naresh
Nagarjuna Akkineni, Allari Naresh
నాగార్జున అక్కినేని మోస్ట్ ఎవైటెడ్ సంక్రాంతి అట్రాక్షన్ 'నా సామిరంగ' కోసం ఆస్కార్- అవార్డ్ విన్నింగ్ కంపోజర్ ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. మొదటి పాట మెలోడియస్ చార్ట్‌బస్టర్ అయితే, టైటిల్ నంబర్‌గా ఉన్న రెండవ పాట మ్యాసీగా అలరించింది. ఈ రోజు, మూడవ సింగిల్- 'దేవుడే తన చేతితో' పాటని విడుదల చేశారు
 
నాగార్జున, అల్లరి నరేష్ మధ్య ఉన్న స్నేహం గురించి హృదయాన్ని హత్తుకునే పాట ఇది. విజువల్స్ చిన్నప్పటి నుండి వారి బంధాన్ని చూపుతున్నాయి. వారి ప్రయాణం మనసుని కదిలించేలా వుంది. వారి బంధం చాలా బలంగా ఉంది. ఎంఎం కీరవాణి రాసిన సాహిత్యం స్నేహం గురించి గొప్పగా చెబుతుంది, శాండిల్య పిసాపాటి అద్భుతంగా ఆలపించారు. నాగార్జున, అల్లరి నరేష్ కెమిస్ట్రీ చాలా బాగుంది.
 
నాగార్జున సరసన ఆశికా రంగనాథ్ కథానాయికగా నటిస్తుండగా, రాజ్ తరుణ్, మిర్నా మీనన్, రుక్సార్ ధిల్లాన్ ఇతర ముఖ్య తారాగణం.
 
శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌పై శ్రీనివాస చిట్టూరి భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పిస్తుండగా శివేంద్ర దాశరధి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
 
ఈ చిత్రానికి బ్లాక్ బస్టర్ రచయిత ప్రసన్న కుమార్ బెజవాడ కథ, మాటలు అందించారు.
 సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ చిత్రం గ్రాండ్ గా విడుదల కానుంది.