శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 20 జనవరి 2017 (08:44 IST)

అయ్య బాబాయ్.. వాడితో కలిసి మళ్లీ నటించడమా? నో ఛాన్స్ : నాగార్జున

అక్కినేని నాగార్జున, ఆయన తనయుడు నాగ చైతన్య అక్కినేని కాంబినేషన్‌లో మరో మల్టీస్టారర్ మూవీ రానుందనే వార్త సోషల్ మీడియాతో పాటు.. ఫిల్మ్ నగర్‌లో హల్‌చల్ చేసింది. గతంలో వీరిద్దరితో పాటు.. సీనియర్ నటుడు అక్

అక్కినేని నాగార్జున, ఆయన తనయుడు నాగ చైతన్య అక్కినేని కాంబినేషన్‌లో మరో మల్టీస్టారర్ మూవీ రానుందనే వార్త సోషల్ మీడియాతో పాటు.. ఫిల్మ్ నగర్‌లో హల్‌చల్ చేసింది. గతంలో వీరిద్దరితో పాటు.. సీనియర్ నటుడు అక్కినేని నాగేశ్వర రావు కాంబినేషన్‌లో గతంలో వచ్చిన "మనం" చిత్రం సూపర్ డూపర్ హిట్ అయిన విషయం తెల్సిందే. ఇదేవిధంగా నాగార్జున, చైతూ, అఖిల్ కాంబినేషన్‌లో 'దిల్' రాజు నిర్మాణంలో సతీష్ వేగేశ్న దర్శకత్వంలో ఈ మూవీ రానుందని న్యూస్ హల్ చల్ చేసింది. 
 
వీటిపై నాగార్జున స్పందించారు. నాగ చైతన్యతో కలిసి నటించే అవకాశమే లేదన్నారు. కానీ ఇది నాకు మాత్రమే వార్త అని నాగ్ తన ట్విటర్‌లో చమత్కరించాడు. ప్రస్తుతానికి తన తనయుడు చైతూతో తిరిగి మల్టీ‌స్టారర్‌లో నటించే అవకాశాలు లేవని పరోక్షంగా క్లారిటీ ఇచ్చాడు. మరోవైపు.. నాగ్ నటిస్తున్న తాజా చిత్రం "ఓం నమో వెంకటేశాయ" షూటింగ్ చాలావరకు పూర్తి అయింది.. ఫిబ్రవరి 10న రిలీజ్ కానుంది. ఈ చిత్రం తర్వాత ఓంకార్‌తో 'రాజుగారి గది-2' నాగ్ చేయబోతున్నాడు.