శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : గురువారం, 30 నవంబరు 2017 (17:04 IST)

'కింగ్' సరసన కొత్త పిల్ల : ఫోటోలతో ట్వీట్ చేసిన వర్మ

టాలీవుడ్ 'మన్మథుడు' అక్కినేని నాగార్జున సరసన కొత్త అమ్మాయి నటించనుంది. ఆ అమ్మాయి వయసు 25 యేళ్లు. ఈ యువతిని వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ టాలీవుడ్‌కు పరిచయం చేస్తున్నాడు.

టాలీవుడ్ 'మన్మథుడు' అక్కినేని నాగార్జున సరసన కొత్త అమ్మాయి నటించనుంది. ఆ అమ్మాయి వయసు 25 యేళ్లు. ఈ యువతిని వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ టాలీవుడ్‌కు పరిచయం చేస్తున్నాడు.
 
దర్శకుడు రాంగోపాల్ వర్మ హీరో నాగార్జున కాంబినేషన్‌లో 25 ఏళ్ళ తర్వాత ఓ మూవీ తెరకెక్కనున్న విషయం తెల్సిందే. పోలీస్ నేపథ్యంగా ఈ చిత్రం తెరకెక్కనున్న ఈ చిత్రానికి "కంపెనీ" అనే పేరు పెట్టారు. నవంబర్ 20వ తేదీన పూజా కార్యక్రమాలు జరుపుకుంది.
 
అయితే ఈ సినిమాపై అభిమానులలోను భారీ అంచనాలు నెలకొనగా, కొద్ది రోజుల నుండి చిత్రానికి సంబంధించిన హీరోయిన్ ఎవరనే దానిపై సినీ లవర్స్‌లో ఉత్కంఠ నెలకొంది. హీరోయిన్ ఎవరనే దానిపై భిన్న కథనాలు వెలువడ్డాయి. సీనియర్ నటి టాబు అని ఒకరంటే అనుష్క అని మరొకరు అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.
 
ఈనేపథ్యంలో దర్శకుడు వర్మ తన సోషల్ మీడియా వేదికగా హీరోయిన్ ఎవరనే దానిపై క్లారిటీ ఇచ్చారు. పాత్రల విషయంలో ఎప్పుడు కొత్తదనాన్ని చూపించే ఆర్జీవి నాగ్ సరసన నటించేందుకు మైరా సరీన్ అనే కొత్త అమ్మాయిని సెలక్ట్ చేశాడు. విభిన్న హావ భావాలతో కూడిన ఈ అమ్మడి ఫోటోలని షేర్ చేసి మరోసారి తన టేస్ట్ ఎలాంటిదో ప్రేక్షకులకు వివరించారు.