బుధవారం, 15 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 22 అక్టోబరు 2024 (15:30 IST)

హిమాలయాల్లో చిత్రీకరించిన మన్యం ధీరుడు చిత్రంలోని నమోస్తుతే.. పాటకు ఆదరణ

Manyam Dheerudu team
Manyam Dheerudu team
హిమాలయాల్లో చిత్రీకరించిన మన్యం ధీరుడు చిత్రంలోని నమోస్తుతే.. పాటకు ఆదరణ పొందటం పట్ల చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేసింది. విశేషం ఏమంటే.. ఈ సినిమా  కధానాయకుడైన ఆర్ వి వి సత్యనారాయణ స్వయంగా స్వరకల్పన చేసి పాడి హిమాలయాల్లో చిత్రీకరించడం తో ఒక ప్రత్యేకతను సంతరించుకుంది.

ఈపాటను ఇటీవల కాలంలో థాయిలాండ్,మలేషియా,బ్యాంకాక్,మైన్మార్ లాంటి దేశాలలో ప్రవాస భారతీయులు విదేశీయులతో సహా మన దేశ గాయకులకు పలు ప్రశంసలందిస్తున్నారు.
 
త్వరలో   అమెరికాలో గల థానా మరియు జెర్మనీ లో కూడా ఈ పాటను పాడబోతున్నామని విశాఖకు చెందిన శేఖర్ ముమ్మో జీ బృందం తెలియజేసారు. ఈ పాటకు తుంబలి శివాజీ సాహిత్యాన్నందించారు. భారత దేశ ఔన్యత్యాన్ని చాటి చెప్పే ఈ అద్భుతమైన పాట ఇంకా ఎంతో ప్రాచుర్యం పొందుతుందని చిత్రటీమ్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.