1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 23 మే 2016 (15:01 IST)

మహేష్ బాబు దత్తపుత్రిక సిద్ధాపూర్‌ అభివృద్ధే లక్ష్యం: నమ్రత

శ్రీమంతుడు హిట్‌తో పాటు ఆ సినిమా ఇచ్చిన స్ఫూర్తితో గ్రామాలను సెలెబ్రిటీలు దత్తత తీసుకునేందుకు ముందడుగు వేశారు. శ్రీమంతుడు సినిమా తరహాలో టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు మహబూబ్‌నగర్ కొత్తూర్ మండలంలోని సిద్ధాపూర్ గ్రామాన్ని దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ గ్రామాభివృద్ధి కోసం ప్రిన్స్ ఫ్యామిలీ తగిన చర్యలు తీసుకుంటోంది. 
 
తాజాగా ఈ గ్రామాభివృద్ధి కోసం మహేష్ బాబు సతీమణి నమ్రత సోమవారం తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావుతో సచివాలయంలో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో సిద్ధాపూర్‌ను ఆకర్షణీయ గ్రామంగా మార్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు నమ్రత వెల్లడించారు. సిద్ధాపూర్ గ్రామాభివృద్ధికి ప్రభుత్వానికి అన్ని విధాలా సహకరిస్తామని నమ్రత హామీ ఇచ్చారు. సిద్ధాపూర్‌ను స్మార్ట్ విలేజ్‌గా మార్చేందుకు సంబంధించిన అన్ని వివరాలను మెమొరాండంను సిద్ధం చేశామని.. విద్య, వైద్య రంగాల్లో ఆ గ్రామాన్ని అభివృద్ధి చేసే దిశగా రంగం సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు.