శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: శనివారం, 14 సెప్టెంబరు 2019 (22:20 IST)

గ్యాంగ్ లీడర్ దెబ్బకు థాయ్ లాండ్‌లో నాని... ఎందుకు?

నేచుర‌ల్ స్టార్ నాని తాజా చిత్రం గ్యాంగ్ లీడర్. విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన గ్యాంగ్ లీడ‌ర్ ఆశించిన స్ధాయిలో ఆక‌ట్టుకోలేద‌ని చెప్ప‌చ్చు. నాని తన తదుపరి సినిమా షూటింగుకి సిద్ధమవుతున్నాడు. నాని తదుపరి చిత్రానికి ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. వి అనే టైటిల్‌తో ఈ క్రైమ్ థ్రిల్లర్ రూపొందుతోంది. 
 
ఈ సినిమాలో సుధీర్ బాబు - నాని ఇద్దరూ ప్రధానమైన పాత్రలను పోషిస్తున్నారు. ఇక అసలు విష‌యానికి వ‌స్తే.... నాని థాయ్‌లాండ్ వెళుతున్నారు. ఎందుకంటే... వి మూవీ షూటింగ్ ప్రస్తుతం థాయ్ లాండ్లో జరుగుతోంది. సుధీర్ బాబు కాంబినేషన్లోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు. త్వరలోనే నాని అక్కడ జరుగుతోన్న షూటింగులో జాయిన్ కానున్నాడు. 
 
నాని - సుధీర్ బాబు కాంబినేషన్లో అక్కడ కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తారట. నాని పాత్ర నెగెటివ్ షేడ్స్‌తో కూడినదిగా వుంటుందనే టాక్ వినిపిస్తోంది. ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో, నివేదా థామస్.. అదితీరావు హైదరి కథానాయికలుగా కనిపించనున్నారు. ఈ మూవీ అయినా నానికి ఆశించిన విజ‌యాన్ని అందిస్తుందో లేదో..?