మిస్టర్ ఎంపీ... పిచ్చి వాగుడు కట్టిపెట్టి, వొళ్ళు వంచి పనిచేయరా బడుద్దాయ్!

varaprasad pvp
Last Updated: బుధవారం, 4 సెప్టెంబరు 2019 (17:42 IST)
టీడీపీకి చెందిన ఎంపీ కేశినేని నాని, ఆ స్థానం నుంచి వైకాపా తరపున పోటీ చేసి ఓడిపోయిన సినీ నిర్మాత పీవీవీ వరప్రసాద్. వీరిద్దరి మధ్య గత కొన్ని రోజులుగా ట్వీట్స్ వార్ సాగుతోంది. ఈ క్రమంలో తాజాగా కేశినేని నాని చేసిన ఓ ట్వీట్‌కు పీవీపీ ఘాటుగా సమాధానమిచ్చారు. "ఆర్థిక నేరస్థులు కూడా పాఠాలు చెప్పే స్థాయికి ఎదిగానని భావించటం అంటే తప్పకుండా ఈ రాష్ట్రానికి పట్టిన కర్మే" అంటూ కేశినేని నాని ట్వీట్ చేశారు.

దీనికి పీవీపీ తనదైనశైలిలో కౌంటరిచ్చారు. "Mr.MP, RECESSION స్పెల్లింగ్ కూడా రాని వాడివి, మా కర్మ కాకపోతే, నీకెందుకయ్యా, ఎకానమీ గురించి స్టేట్మెంట్స్! Will educate you on public spending during a soft economic environment. Can you please advise how to bail out a close to BANKRUPT State left by you all?"

"చదువు సంధ్య లేని బజారు మనుషులు కూడా మాట్లాడడం మన తెలుగు ప్రజల కర్మ. ఇష్యూ డైవర్ట్ చెయ్యకు, కావాలంటే ఇంగ్లీష్, తెలుగు ట్యూషన్ మాస్టర్స్ పంపిస్తాను! పిచ్చి వాగుడు కట్టిపెట్టి, వొళ్ళు వంచి పనిచేయరా బడుద్దాయ్! లేదంటే, నీ ఇంటికొస్తా, నీ ఆఫీసుకొస్తా, ఎక్కడున్నా వచ్చి నీ పళ్ళు రాలగొడతాట" అంటూ ట్వీట్ చేశారు.దీనిపై మరింత చదవండి :