బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 30 జూన్ 2017 (11:49 IST)

నారా రోహిత్ చేపలు పులుసు ఎలా చేశాడో వీడియోలో చూడండి..

టాలీవుడ్‌లో నారా రోహిత్ తనదైన స్టైల్‌లో నటుడిగా మంచి మార్కులు కొట్టేశాడు. తాజాగా శమంతకమణి చిత్రంలో నటిస్తున్న నారా రోహిత్.. వంటమనిషి అవతారం ఎత్తాడు. భ‌లే మంచి రోజు ఫేం శ్రీరామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వంలో శ

టాలీవుడ్‌లో నారా రోహిత్ తనదైన స్టైల్‌లో నటుడిగా మంచి మార్కులు కొట్టేశాడు. తాజాగా శమంతకమణి చిత్రంలో నటిస్తున్న నారా రోహిత్.. వంటమనిషి అవతారం ఎత్తాడు. భ‌లే మంచి రోజు ఫేం శ్రీరామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వంలో శ‌మంత‌క‌మ‌ణి చిత్రంలో పోలీసాఫీసర్‌గా నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ గ్యాప్‌లో నారా రోహిత్ నోరూరించే చేపల పులుసు చేశాడు. 
 
రోహిత్ వంట‌కాన్ని వీడియోలా రూపొందించిన టీం చివ‌రిలో ట్రైల‌ర్‌ని జూన్ 30న విడుద‌ల చేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించింది. భ‌వ్య క్రియేష‌న్స్ బేన‌ర్ పై ఆనంద్ ప్ర‌సాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సుధీర్ బాబు, సందీప్ కిషన్, నారా రోహిత్, ఆది,రాజేంద్ర ప్రసాద్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. 
 
ఈ సినిమా షూటింగ్ గ్యాప్‌లో త‌న స్వ‌హ‌స్తాల‌తో ఫిష్ కర్రీ చేసి నారా రోహిత్ యూనిట్‌కి షాక్ ఇచ్చాడు. దర్శకుడు శ్రీరామ్, నటుడు రఘు ఇక సినీ యూనిట్ అంతా నారా రోహిత్ చేసే చేపలు కూరను టేస్ట్ చేసి షాక్ అయ్యారట. అయితే ఈ హ‌డావిడి అంతా సినిమా ప్ర‌మోష‌న్‌లో భాగంగానే చేశారని సినీ జనం అంటున్నారు.