శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 8 ఏప్రియల్ 2023 (09:00 IST)

అతి ప్రవర్తించాడు.. అభిమానిపై ఫైర్ అయిన నయనతార..

ప్రముఖ నటి నయనతార అభిమానిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని భర్త విఘ్నేశ్ శివన్‌తో కలిసి గురువారం తంజావూరులోని తమ కులదైవం ఆలయాన్ని నయన్ సందర్శించారు. ఈ సందర్భంగా వారిద్దరూ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. 
 
ఈ విషయం తెలిసిన స్థానికులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. వారిని నియంత్రించడం పోలీసులకు సాధ్యం కాలేదు. దీంతో తోపులాట జరిగింది. దీంతో నయన్ పూజ అనంతరం బయటకు వచ్చేసి వెళ్లిపోయేందుకు సిద్దమయ్యారు. 
 
నయన్ రైలులోకి ఎక్కిన వెంటనే ఓ యువకుడు అతిగా ప్రవర్తించాడు. ఆమెతో సెల్ఫీ వీడియో తీసుకునేందుకు ఈ క్రమంలో ప్రయత్నించాడు. దీంతో అప్పటికే కోపంగా ఉన్న నయన్.. వీడియో తీయడం ఆపకుంటే ఫోన్ పగలగొట్టేస్తానని హెచ్చరించారు.