బుధవారం, 1 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 3 ఏప్రియల్ 2023 (11:28 IST)

జవాన్ సినిమా షూటింగ్‌లో నయనతార

Nayanatara
బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ నటించిన అట్లీ జవాన్ మొదటి దశ కొన్ని నెలల క్రితం పూణెలో ప్రారంభమైంది. నయనతార, షారుక్ ఖాన్ సహా పలువురు షూటింగ్‌లో పాల్గొన్నారు. 
 
ఈ సినిమా కోసం అట్లీ మూడేళ్లకు పైగా ముంబైలో ఉంటున్నారు. ఇప్పుడు షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమా ప్రమోషన్స్ పూర్తి చేసిన షారుఖ్ మళ్లీ జవాన్‌పై దృష్టి పెట్టాడు. 
 
ఈ చిత్రాన్ని జూన్ 2న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన అన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. దీని తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నట్లు సమాచారం. కాగా, మిగిలిన 2 పాటల సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఓ పాట సన్నివేశంలో పాల్గొనేందుకు నయనతార ముంబైలో క్యాంప్ చేస్తోంది. 
 
ఇందులో షారుఖ్ ఖాన్, నయనతార, దీపికా పదుకొణెలతో పాటు, అట్లీ దర్శకత్వం వహించిన ‘జవాన్’ దక్షిణాది నటనా పవర్‌హౌస్ విజయ్ సేతుపతి వుంటారు. విజయ్ సేతుపతి ఇందులో నెగిటివ్ రోల్‌లో కనిపించనున్నాడు.