గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 2 మార్చి 2023 (19:42 IST)

షారూఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్‌పై కేసు

sharukh khan
బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ సతీమణి గౌరీ ఖాన్ న్యాయపరమైన చిక్కుల్లో చిక్కుకున్నారు. ముంబైకి చెందిన జశ్వంత్ షా లక్నోలో గౌరీతో పాటు ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న కంపెనీకి చెందిన పలువురు సభ్యులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 
 
తనకు రూ.86 లక్షలు వసూలు చేసినప్పటికీ ఫ్లాట్ ఇవ్వడంలో కంపెనీ విఫలమైందని జశ్వంత్ షా ఆరోపించారు. ఆ ఫ్లాట్‌ను వేరొకరికి ఇచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
 
బ్రాండ్ అంబాసిడర్ గౌరీఖాన్ తనను ఈ ఫ్లాట్ కొనుగోలుకు ప్రభావితం చేశారని జశ్వంత్ షా ఆరోపించారు. ఎఫ్ఐఆర్ గౌరీఖాన్‌తో పాటు కంపెనీకి చెందిన పలువురు సభ్యుల పేర్లు ఉన్నాయి.