శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 14 అక్టోబరు 2022 (19:42 IST)

బుల్లితెరపై ఏంటి.. ఇక వెండి తెరపై కూడా వంటలక్క వచ్చేస్తోంది..!

Premi
Premi
కార్తీక దీపంతో పాపులరైన వంటలక్క గురించి తెలిసిందే. 'కార్తీక దీపం'లో వంటలక్క పాత్రను 'ప్రేమి విశ్వనాథ్' పోషించింది. విశాలమైన కళ్లతో చకచకా హావభావాలను పలికించడం ఆమె ప్రత్యేకతగా కనిపిస్తూ ఉంటుంది.
 
ఫ్యామిలీ ఆడియన్స్‌లో ప్రేమి విశ్వనాథ్‌కి మంచి క్రేజ్ ఉంది. ఆమె కోసమే ఆ సీరియల్‌ను ఫాలో అయ్యేవారు ఉన్నారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. 
 
అలాంటి ఆమె తెలుగు తెరకి పరిచయమవుతోంది. నాగచైతన్య హీరోగా రూపొందుతున్న వెంకట్ ప్రభు సినిమాలో ఆమె ఒక కీలకమైన పాత్రను పోషించనుంది. వెంకట్ ప్రభు తెలుగు, తమిళ భాషల్లో రూపొందిస్తున్న ఈ సినిమాలో కృతి శెట్టి కథానాయికగా నటిస్తోంది.