ఆదివారం, 26 మార్చి 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated: శుక్రవారం, 14 అక్టోబరు 2022 (15:12 IST)

జల్లెడ పట్టుకుని చంద్రుడి వైపు చూసిన పూనమ్.. పెళ్లి కుదిరిందా?

poonam
poonam
సోషల్ మీడియాలో ప్రస్తుతం పూనమ్ కౌర్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. నెటిజన్లకు కర్వాచౌత్ శుభాకాంక్షలు చెప్తూ.. ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటో నెట్టింటిని షేక్ చేస్తున్నాయి. ఈ ఫోటోలో పూనమ్.. జల్లెడ పట్టుకుని చంద్రుడి వైపు చూసి చిరునవ్వు చిందిస్తూ కనిపించింది. 
 
అయితే ఈ ఫోటోను పోస్టు చేసిన గంటలకే నెటిజన్లు ఆమెపై ట్రోల్స్ మొదలెట్టారు. పెళ్లైన వారే ఈ పండుగ చేసుకుంటారని.. అయితే మీరెందుకు చేసుకున్నట్లు.. పెళ్లి కుదిరిందా అంటూ ప్రశ్నలు వేస్తున్నారు. 
 
ఉత్తరాది రాష్ట్రాల్లో కర్వాచౌత్ వేడుకను భర్త దీర్ఘాయుష్షును కోరుతూ వివాహిత మహిళలు జరుపుకుంటారు. పార్వతీదేవిని పూజించి రోజంతా ఉపవాసం వుండి ఈ వేడుకను నిర్వహిస్తారు. చంద్రుడిని జల్లెడలో చూసి.. ఆపై భర్తముఖాన్ని చూడటం ద్వారా ఈ వేడుకలు పూర్తవుతాయి. కానీ పెళ్లి కాని వారు కాబోయేభర్తతో ఈ పూజలు చేసుకోవచ్చు. 
 
అయితే ఈ వేడుకను ప్రస్తుతం పూనమ్ చేసుకోవడం ఏంటని ప్రస్తుతం చర్చ సాగుతోంది. ఆమెకు పెళ్లి కుదరడంతోనే కాబోయే భర్తతో చేసుకుందా అనే దానిపై చర్చ సాగుతోంది.